Pakistani Beggars: ఉమ్రా వీసాలపై సౌదీ అరేబియాకు వెళ్లి భిక్షాటన కార్యకలాపాల్లో నిమగ్నమైన పాకిస్థానీల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. దీంతో సౌదీ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు మత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వర్గాలు తెలిపాయి. ఈ సమస్య ఇలాగే కొనసాగితే ఉమ్రా, హజ్ యాత్ర చేపట్టే పాకిస్తానీ యాత్రికుల పరువు, భవిష్యత్త్ ఏర్పాట్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సౌదీ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే.. పాక్ యాత్రికులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
Read Also: TG High Court: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు..
ప్రస్తుతం సౌదీ అరేబియాలో 4300 మంది యాచకుల జాబితాను సిద్ధం చేశామని.. త్వరలోనే వారిని తరిమికొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని సౌదీ అధికారులు తెలిపారు. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. సౌదీ అరేబియాకు వెళ్లే ముందు ప్రజలు అఫిడవిట్ ఇవ్వాలనేది ఒక నియమం పెట్టారు. అక్కడకు వెళ్లి భిక్షాటన చేయబోమని ప్రమాణం చేసి.. అఫిడవిట్ రాసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏ ఏజెన్సీ అయినా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం హెచ్చరించింది.