Site icon NTV Telugu

పాక్‌కు చైనా మిత్ర దేశ‌మే…కానీ, ముక్కుపిండి వ‌సూలు చేసింది…

పాక్ చైనాల మ‌ధ్య విడిపోలేని బంధం ఉన్నప్ప‌టికీ కొన్ని విష‌యాల్లో చైనా త‌న అస‌లు స్వ‌రూపాన్ని బ‌య‌టపెట్టి పాక్‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ది.  పాక్‌కు ఆర్థికంగా అండ‌దండ‌లుగా ఉన్న చైనా, న‌ష్ట‌ప‌రిహారాన్ని వ‌సూలు చేయ‌డంలో కూడా అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తోంది.  పాక్‌లో దాసు హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్టును చైనాకు చెందిన జెగ్‌హుబా కంపెనీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న‌ది.  అయితే, ఈ ప్రాజెక్టు వ‌ద్ద 2021 జులై 14 వ తేదీన ఉగ్ర‌వాదులు దాడులు జ‌రిపారు.  ఈ దాడుల్లో 36 మంది చైనీయులు మృతి చెందారు.  దీంతో త‌మ కార్మికుల ప్రాణాల‌కు విలువ క‌ట్టాల్సిందేన‌ని చెప్పి చైనా భీష్మించుకుకూర్చున్న‌ది.  

Read: కీల‌క నిర్ణ‌యం: నెల రోజుల‌పాటు డ్రోన్‌ల‌పై నిషేధం…

దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోతే ప‌నులు నిలిపివేస్తామ‌ని, మ‌ర‌ణించిన 36 మంది కార్మికుల కుటుంబాల‌కు 38 మిలియ‌న్ డాల‌ర్లు ప‌రిహారం చెల్లించాల్సిందేన‌ని చైనా స్ప‌ష్టం చేసింది.  అస‌లే ఆర్థికంగా అతాలాకుత‌లం అవుతున్న పాక్ అంత‌టి ప‌రిహారం చెల్లించాలంటే క‌ష్ట‌మే.  చైనా నిర్మిస్తున్న కారిడార్‌తో దీనికి సంబంధం లేక‌పోవ‌డంతో చైనా ప్ర‌భుత్వం దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.  చేసేది లేక పాక్ అప్పులు తెచ్చి ప‌రిహారం చెల్లించింది.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌బ్యాంక్ స‌హ‌కారంతో దాసు హైడ్రోప‌వ‌ర్ ప్రాజెక్ట్ ప‌నుల‌ను తిరిగి ప్రారంభించింది.  

Exit mobile version