Imran Khan: శనివారం జరిగిన ఇస్లామాబాద్ ర్యాలీలో పోలీసులు, న్యాయవ్యవస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలను బెదిరించినందుకు అతనిపై నమోదైన ఉగ్రవాద కేసులో పాకిస్తాన్ బహిష్కృత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టు గురువారం వరకు రక్షణ బెయిల్ మంజూరు చేసింది. తీవ్రవాద నిరోధక చట్టం కింద ఖాన్‌పై ఆదివారం అభియోగాలు మోపారు. అంతకుముందు రోజు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఇమ్రాన్‌ఖాన్ పాలక వర్గాన్ని లక్ష్యంగా చేసిన విమర్శల వల్లే ఆయనపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన తరఫున న్యాయవాదులైన బాబర్ అవాన్, ఫైసల్ చౌదరి బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు.. అరెస్ట్ చేసే అవకాశం
అవినీతి, అవినీతి రాజకీయ నాయకులపై విమర్శలు చేసినందుకే ఇమ్రాన్‌ఖాన్‌పై కేసులు బనాయించారని పేర్కొన్నారని పిటిషన్‌లో పేర్కొన్నట్లు డాన్ వార్తాపత్రిక నివేదించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ (ICT) పోలీసులు అతనిపై తప్పుడు, పనికిమాలిన ఫిర్యాదు నమోదు చేశారని వెల్లడించారు. తప్పుడు ఆరోపణలతో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని పరిమితులను దాటాలని నిర్ణయించుకుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇమ్రాన్‌ఖాన్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించిందని పాక్ ప్రభుత్వంపై పిటిషన్‌లో తెలిపారు.
