pakistan-Blasphemy case against Hindu man..Attempt to attack:పాకిస్తాన్ లో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే బలవంతంగా మతం మార్చడం, హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం అక్కడ మామూలు అయిపోయింది. దీంతో ఒకప్పుడు 10 శాతం వరకు ఉన్న హిందువుల జనాభా ప్రస్తుతం 2 శాతానికి లోపే ఉంది. ఇదిలా ఉంటే అక్రమంగా ‘దైవ దూషణ’ కేసులు పెడుతూ.. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని హైదరాబాద్ నగరంలో ఓ హిందూ పారిశుద్ధ్య కార్మికుడు ఖురాన్ ను అపవిత్రం చేశాడని ఆరోపిస్తూ స్థానికులు దాడికి ప్రయత్నించారు. సదరు హిందూ కార్మికుడు అశోక్ కుమార్ ఎలాంటి దైవ దూషణకు పాల్పడకున్నా అతనిపై కేసు నమోదు అయింది. అశోక్ కుమార్ ను పట్టుకునేందుకు మెజారిటీ వర్గం ఓ అపార్ట్మెంట్ చుట్టూ చేరి.. అతనిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు గుంపును అడ్డుకుని బాధితులు అశోక్ కుమార్ ను అరెస్ట్ చేశారు.
Read Also: KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?
అయితే స్థానికంగా ఉండే నివాసితో వ్యక్తిగత ఘర్షణ కారణంగా అతడిని లక్ష్యంగా చేసుకుని.. తప్పుడు దైవదూష ఆరోపణలు చేసినట్లు పోలీస్ అధికారి ముబాషిర్ జైదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అశోక్ కుమార్ ను హైదరాబాద్ లోని సదర్ లోని రబియా సెంటర్లో ఉంచారు పోలీసులు. దీనిపై పాకిస్తాన్ జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు స్పందిస్తున్నారు. స్థానికంగా ఉండే దుకాణదారుడు బిలాల్ అబ్బాసీతో గొడవ తర్వాత అశోక్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయని తేలిందని పాక్ జర్నలిస్ట్ ఇనాయత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
అ అబద్దపు ఆరోపణలతో కోపోద్రిక్తులైన ప్రజల గుంపు హిందూ కార్మికుడు అశోక్ కుమార్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ను తగలబెట్టింది వాస్తవానికి ఒక మహిళ అని సమాచారం. అయితే అశోక్ కుమార్ ను గుంపు చేతికి చిక్కకుండా కాపాడిన పాక్ పోలీసులు పనితీరును సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు పాక్ ప్రజలు. నేరస్తులు, ఇలా తప్పుడు ఆరోపణలను ప్రేరేపించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని.. ఏవిధమైన మతోన్మాదానికి ఆస్కారం లేదని పాక్ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో మైనారిటీలు, ముస్లింలో కొంతమందిపై దైవదూషణ కేసులు పెడుతూ.. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో క్రూరమైన దైవదూషణ చట్టాలను దుర్వినయిోగం చేస్తోంది. గతేడాది 2021లో దైవదూషణ ఆరోపణలపై పాకిస్తాన్ లో ఓ గుంపు శ్రీలంక జాతీయుడిని కొట్టి, తగలపెట్టింది. ఈ ఘటనను అప్పటి ప్రధాని పాకిస్తాన్ కు ఇది అవమానకరమైన రోజుగా అభివర్ణించారు.
