Site icon NTV Telugu

Jeans Rs.60 lakhs: జీన్స్‌ రూ.60 లక్షలా.. ఏముంది భయ్యా అందులో..

Jeans Rs.60 Lakhs

Jeans Rs.60 Lakhs

Jeans Rs.60 lakhs: వస్తువులు పాతవైతే అవి మనం పక్కన పెట్టేస్తాం.. వాటి స్థానంలో కొత్తవి కొంటాం. కానీ ఓ ప్రబుద్దుడు చేసిన జీన్స్‌ కిరాకీ చూస్తే.. కిరాక్‌ అనిపిస్తుంది. అతను పిచ్చోడా? లేక నిజంగానే ఈ జీన్స్‌ విలువ ఇంత వుంటుందా అని మనకు ప్రశ్న ఎదురవుతుంది. మన పెద్దలు ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ ​​అని సింపుల్‌గా చెప్పారు. నేను రాను.. రాను.. పాత వస్తువులకు గిరాకీ పెరుగుతుందని అంటే నేను ఏదో అనుకున్నాం.. కానీ ఇంత పెద్దఎత్తున ఊహించలేదు. ఎవరైనా వాడేసిన జీన్స్‌ను రూ. 60 లక్షలు కొంటారా? కొనరు. అది జరిగే ప్రశక్తే లేదు అంటారా? కానీ, ఒక మహానుభావుడు దానిని కొన్నాడు. అది నచ్చిందో లేదో తెలియదు కానీ, అంత డబ్బు పెట్టి కొనేశాడు. ఆతర్వాత అతనే ఆశ్చర్యపోయాడు. అలాంటి ఘటన ఒకటి మెక్సికోలో చోటుచేసుకుంది.

అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి ‘లెవీ జీన్స్’ జత అమ్మకానికి వేలం పాట నిర్వహించారు. ఇక్కడ పాత వస్తువుల వేలం క్రమం తప్పకుండా జరుగుతుంది. జత జీన్స్ రూ.60 లక్షలకు కొన్నారు. మెక్సికోలో జరిగిన ఓ వేలంపాటలో 2 ఓల్డ్ జీన్స్ ఏకంగా 76 వేల డాలర్లు పలికాయి. ఈ 2 జీన్స్ 1880ల నాటి ‘లెవీ’ జీన్స్ కావడమే ఈ ధరకు కారణం. శాన్‌ డియాగోకు చెందిన ‘కైల్ హౌపెర్ట్’ అనే 23 ఏళ్ల దుస్తుల వ్యాపారి.. డెనిమ్ డాక్టర్స్ యజమాని స్టీవెన్సన్తో కలసి ఈ జీన్స్ను 76 వేల డాలర్ల (మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే)కు కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి జీన్స్ కు 87,400 డాలర్లు చెల్లించాల్సి ఉంది.

Read also: Nidhhi Agerwal: ఆ సినిమాలకు ఎంతిస్తే అంత తీసుకుంటా..

ప్యాంట్‌ కొన్న హూపెర్ట్‌ మాట్లాడుతూ.. “నేను ఇప్పటికీ ఒక రకమైన గందరగోళంలో ఉన్నాను, నేను ఆ ప్యాంటు కొన్నందుకు ఆశ్చర్యపోయాను” అని చెప్పాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించినట్టు తెలుస్తోంది.ఏదైతే నేం ఆప్యాంట్‌ చూసిన వారంతా ఏముంది భయ్యా అందులో దానికి అన్ని లక్షలు ధారపోశావు అంటూ ఆశ్చర్యం కలిగిస్తున్న ఇమోజీని పోస్టు చేస్తున్నారు. అయినా ఆ జీన్స్‌ను రూ.60 లక్షలు పెట్టికొన్న అతనే ఆశ్చర్యపోతే.. చూసిన మనకు ఆశ్చర్య పడటంలో తప్పులేదుకదా!

రూ.60 లక్షల జీన్స్‌ ఇదే..

జీన్స్‌ వేలం మామూలుగా లేదుగా..

Exit mobile version