Site icon NTV Telugu

Poisoning of students: 57 మంది విద్యార్థులపై విషప్రయోగం.. ఆ దేశంలో రెండు వారాల్లో మూడో ఘటన

Poisoing

Poisoing

Over 50 students mysteriously poisoned in Mexico school in mexico: మెక్సోకో దేశంలో 57 మంది చిన్నారులపై విషప్రయోగం జరిగింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్ లో గ్రామీణ మాధ్యమిక పాఠశాలలో 57 మంది విద్యార్థులపై గుర్తుతెలియని పదార్థంతో విషప్రయోగం చేశారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత లేబొరేటరీ పరిశోధనల్లో విద్యార్థులు కొకైన్ పాజిటివ్ గా తేలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కలుషితమైన ఆహారం, నీటి వల్లే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతిందని.. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.

Read Also: Amasia: కలిసిపోనున్న అమెరికా, ఆసియా ఖండాలు.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి.

విద్యార్థులపై విషప్రయోగం ఇది మూడో సంఘటన. గత రెండు వారాల్లో మూడు సార్లు విద్యార్థులపై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. బోచిన్ ప్రాంతానికి చెందిన 57 టీనేజ్ విద్యార్థులు విషపూరిత లక్షణాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని.. ఒక విద్యార్థిని ఉన్నతాసుపత్రికి తరలించగా..మిగిలిన విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉందని మెక్సికన్ సోషల్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన పిల్లల తల్లిదండ్రుల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఏం జరిగిందో తెలియక స్కూల్ వద్ద ఉన్న అధికారుల నుంచి సమాధానాలు కోరారు. శనివారం 15 విషనిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ డ్రగ్స్ కు ప్రతికూలంగా వచ్చాయి. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని ఆగ్రహంతో ఉన్నారు.

Exit mobile version