Texas dairy farm explosionఅమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. డిమ్మిట్ లోని సౌత్ ఫోర్క్ డెయిరీ ఫాంలో ఈ దుర్ఘటన జరిగింది. హఠాత్తుగా జరిగిన భారీ పేలుడు మూలంగా ఫామ్ లో ఉన్న 18,000 అవులు మృతి చెందాయి. అందులో పనిచేస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ దాదాపుగా 36 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచానా. 2013 తర్వాత డెయిరీ ఫాంలో ఇంత పెద్ద దుర్ఘటన జరగడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 10న ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
Read Also: Pakistan: పాకిస్తాన్ పరువు పాయె.. ఎంబసీని మూసేసిన స్వీడన్..
అవుల పాలు పితకడానికి సిద్ధం అవుతున్న సందర్భంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. డెయిరీ ఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పేలుడు తర్వాత ఫాంలో మిథేన్ గ్యాస్ ఒక్కసారిగా విడుదలైనట్లు తెలుస్తోంది. దీంతోనే ఎక్కువ ఆవులు మరణించాయని చెబుతున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పేడ ఎక్కువ నిల్వ ఉండటం వల్ల మిథేన్ గ్యాస్ పెద్ద ఎత్తున ఏర్పడినట్లు సమాచారం.
అమెరికా వంటి దేశాల్లో ఒకే చోట పెద్ద ఎత్తున ఆవులను పెంచుతారు. 15,000 కంటే ఎక్కువ ఆవులు ఉంటే దాన్ని ‘బార్ ’గా వ్యవహరిస్తారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన డెయిరీ ఫాంలో ఎక్కువగా యంత్రాలను వినియోగిస్తుంటారు. కొద్ధి మంది మాత్రమే పనివారు ఉంటారు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలను అదుపు చేయడం కుదరలేదు. దీంతోనే ఎక్కువ సంఖ్యలో పశువులు మరణించాయి. పాలు భద్రపరిచే గదిలో ఓ మహిళ చిక్కుకుపోయి గాయాలతో బయటపడింది.