NTV Telugu Site icon

Kenya drought: కెన్యాలో కరువు తాండవం..వేలాదిగా చనిపోతున్న వన్యప్రాణులు

Kenya Drought

Kenya Drought

Over 1,000 zebras, elephants and wildebeest die after Kenya drought: ఆఫ్రికాదేశం కెన్యాలో కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కరువుబారిన పడి అల్లాడుతున్నాయి. కెన్యాలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వన్య ప్రాణులు కరువు దెబ్బకు వేలాదిగా చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 512 వైల్డ్ బీస్ట్, 381 జీబ్రాలు, 205 ఏనుగులు, 49 గ్రేవీస్ జీబ్రాలు, 51 అడవి బర్రెలు చనిపోయాయని కెన్యా ప్రభుత్వ అధ్యయనంలో తేలింది.

Read Also: RRR Record Collections: జపాన్‎లో రికార్డు వసూళ్లు రాబట్టుతున్న ట్రిపుల్ఆర్ మూవీ.. మొత్తం కోట్లంటే

మాంసాహార జంతువుల కన్నా ఈ కరువు వల్ల శాఖాహార జంతువులు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. నీటి కొరత, గడ్డి కొరత కారణంగా వన్యప్రాణులు ప్రాణాలు వదులుతున్నాయి. రోజులు గడిచే కొద్దీ కెన్యాలో కరువు తీవ్రం అవుతోంది. ఫిబ్రవరి, అక్టోబర్ 2022 మధ్య వన్యప్రాణుల మరణానే ఇందుకు నిదర్శనం అని ప్రభుత్వం చెబుతోంది. కెన్యా మొత్తం ఏనుగు జనాభాలో అంబోసెలి, త్సావో, లైకిపియ-సంబురు ప్రాంతాల్లోనే 65 శాతం ఏనుగులు నివాసం ఉంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోనే కరువు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వ్యవసాయ ఎగుముతులు తర్వాత కెన్యాకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. కెన్యా దేశానికి మూడవ అతిపెద్ద విదేశీ మారకాన్ని ఆర్జించేది పర్యాటకమే. ఈ దేశంలో వన్యప్రాణి నేషనల్ పార్కులను చూసేందుకు ప్రపంచం నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి పర్యాటకంపై కరువు ప్రభావం పడుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాసైమారా నేషనల్ పార్క్, నైరోబీ, అంబొసేలీ, త్సావో, మౌంట్ కెన్యా నేషనల్ పార్కులు ఉన్నాయి. వీటిలోని వన్యప్యాణులను చూసేందుకు ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు కెన్యాకు వస్తుంటారు.