Site icon NTV Telugu

అమ్మకానికి లాడెన్ సోదరుడి బంగ్లా… ధర ఎంతంటే…

ఒసామా బీన్ లాడెన్  ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డలాండించ‌న ఉగ్ర‌వాది.  2001లో అమెరికాలోని ట్విన్ ట‌వ‌ర్స్‌ను కూల్చివేత‌లో ప్ర‌ధాన‌పాత్ర పోషించిన వ్య‌క్తి.  పాక్‌లో త‌ల‌దాచుకున్న స‌మ‌యంలో ఆయ‌న్ను అమెరికా సైన్యం హ‌త‌మార్చింది.  లాడెన్ సోద‌రుడు ఇబ్ర‌హీమ్ కు లాస్ ఎంజెల్స్‌లో ఓ విలాస‌వంత‌మైన భ‌వంతి ఉన్న‌ది.  2001 ఘ‌ట‌న‌కు ముందు వ‌ర‌కు ఆ ఇంట్లో ఇబ్ర‌హీమ్ లాడెన్ కుటుంబ స‌భ్యులు ఉండేవారు.  ఎప్పుడైతే 2001లో ట్విన్ ట‌వ‌ర్స్ కూల్చివేత జ‌రిగిందో ఆ త‌రువాత ఆ కుటుంబం ఆ ఇంటిని ఖాళీ చేసింది.  అప్ప‌టి నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉన్న‌ది.  20 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఇంటిని ఇప్పుడు ఆమ్మ‌కానికి పెట్టారు లాడెన్ కుటుంబ స‌భ్య‌లు.  రెండు ఎక‌రాల విశాల‌మైన విస్తీర్ణంలో విస్త‌రించిన భ‌వంతిని 28 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్మాకిని పెట్టారు.  1931లో నిర్మించిన ఈ భ‌వంతిని ఇబ్ర‌హీం రెండు మిలినియ‌న్ డాల‌ర్ల‌కు 1983లో కొనుగోలు చేశారు.  అప్ప‌ట్లో ఒసామాబీన్ లాడెన్ కూడా ఆ భ‌వంతిలో కొన్నాళ్లు నివ‌శించార‌ట‌.  

Read: కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన “ఇస్మార్ట్” బ్యూటీ

Exit mobile version