శ్రీలంకలో చమురు సంక్షోభం నెలకొన్నది. దేశంలో చమురు నిల్వలు అడుగంటాయి. లంకలోని అనేక ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంతో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఆర్థికంగా ఆ దేశం చాలా నష్టపోయింది. విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురును దిగుమతి చేసుకోవడానికి కూడా ఆ దేశం వద్ద నిధులు లేకుండా పోయాయి. ఇటీవలే రెండు షిప్పుల్లో చమురు శ్రీలంకకు వచ్చినా వాటికి డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడం ఆ దేశం ఆర్ధికంగా ఏ విధంగా మారిపోయిందో చెప్పవచ్చు.
Read: Bheemla Nayak Trailer: ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ…
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు డీజిల్‌ను అమ్మడంతో చమురు సంస్థలకు 2021లో సుమారు 415 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే రిటైల్ ధరలకు చమురును అమ్ముతూ, దిగుమతి సుంకాలను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే భారత్‌కు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ డీజిల్‌ను శ్రీలంక కొనుగోలు చేసింది. పెట్రోల్‌తో పాటు, పెట్రో ఉత్పత్తుల కొనుగోలు కోసం శ్రీలంకకు భారత్ 500 మిలియన్ డాలర్ల సహాయం అందించింది.
