Site icon NTV Telugu

ఒబామా బ‌ర్త్‌డే పార్టీపై విమ‌ర్శ‌లు… ఎందుకంటే…

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామా 60 వ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.  అయితే, ఈ వేడుక‌ల్లో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.  మొద‌ట ఈ వేడుక‌ల‌కు 500 మందికి పైగా అతిధుల‌ను పిల‌వాల‌ని అనుకున్నా, క‌రోనా ఉధృతి కార‌ణంగా ఆ సంఖ్య‌ను త‌గ్గించారు.  ఈ వేడుక‌లు ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారాయి.  ఎందుకంటే, ఈ వేడుక‌ల‌కు హాజ‌రైన వారిలో చాలామంది మాస్క్ పెట్టుకోలేద‌ని, ప్ర‌స్తుతం అమెరికాలో కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయని, సెల‌బ్రిటీలు మాస్క్ పెట్టుకోకుండా పార్టీలో పాల్గొంటే, సామాన్యుల ప‌రిస్థితులు ఎంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  బియాన్స్, జే జీ, ఓప్రా విన్‌ఫ్రే, గేల్ కింగ్, టామ్ హ్యాంక్స్, జార్జ్ క్లూనీ, జాన్ లెజెండ్, క్రిస్ టైగన్, బ్రాడ్లీ కూపర్, జాన్ కెర్రీ, స్టీఫెన్ కాల్బర్ట్ వంటి సెలబ్రిటీలు పాల్గోన్నారు.  

Read: త్రిపుర సీఎంపై మర్డర్ ఎటాక్.. ముగ్గురు అరెస్ట్

Exit mobile version