Nvidia CEO: ఎన్విడియా పగ్గాలు భారత సంతతి వ్యక్తికి దక్కేనా? రేసులో ముగ్గురు!

  • జెన్సన్ హువాంగ్ నిష్క్రమణతో మొదలైన ఎన్విడియా సీఈఓ రేసు..
  • రేసులో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు..
Nvidia Ceo

Nvidia Ceo

Nvidia CEO: ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా (Nvidia) తదుపరి సీఈఓ ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలతో ఎఫైర్లు, ఆలిస్ హువాంగే అనే మహిళ చైనా తరుఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ, ప్రెసిడెండ్, బోర్డ్ మెంబర్ పదవులకు జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. దాదాపుగా 3 దశాబ్ధాలు ఎన్విడియా ఎదుగుదలకు తోడ్పడిన జెన్సన్, వివాహేతర సంబంధాల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

జెన్సన్ నిష్క్రమణతో ఆయన స్థానంలో కొత్త సీఈఓ ఎంపికకు కంపెనీ బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఈ రేసులో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు కూడా ఉన్నారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ భారత సంతతి టెక్ దిగ్గజం సంజయ్ మల్హోత్రా, ఆల్టో నెట్‌వర్క్స్ అధిపతి నికేష్ అరోరా, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు రాయిటర్స్, ఇతర మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి.

1) సంజయ్ మల్హోత్రా:

అమెరికాకు చెందిన మెమోరీ చిప్ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మల్హోత్రా పేరు ఎన్విడియా సీఈఓ రేసులో వినిపిస్తోంది. 2017నుంచి ఆయన మైక్రాన్‌కు చీఫ్‌గా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ మార్కెట్‌లోకి మైక్రాన్ స్థాయిని విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైక్రాన్‌లో చేరకముందు 1988లో శాండిస్క్ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవం, ఎన్విడియాతో మైక్రాన్‌కు ఉన్న వ్యాపార సంబంధాల కారణంగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

2) నికేష్ అరోరా:

పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా ఈ రేసులో ఉంది. ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కొందరు ఇన్వెస్టర్లు ఆయన పేరును తదుపరి ఎన్విడియా సీఈఓ పదవికి ప్రతిపాదించారు. 2018 నుంచి ఆయన పాలో ఆల్టో నెట్వర్క్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అంతకుముందు గూగుల్, సాఫ్ట్‌బ్యాంక్ సంస్థల్లో కీలక బాద్యతల్లో పనిచేశారు.

3) థామన్ కురియన్:

గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేరు కూడా ఎన్విడియా సీఈఓ పదవి పరిశీలనలో ఉందని ఆక్సియోస్ నివేదించింది. గూగుల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, ఏఐ సేవల్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. భారీ స్థాయిలో టెక్నాలజీ కార్యక్రమాలను నిర్వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లతో పనిచేయడంతో ఈయనకు అనుభవం ఉంది.

రేసులో మరో 8 మంది..

భారత సంతితి వ్యక్తులతో పాటు మరో 8 మంది ఎన్విడియా సీఈఓ రేసులో ఉన్నారు. ప్రస్తుతం తాత్కాలిక సీఈఓగా ఉన్న కొలెట్ క్రెస్‌తో పాటు ఎన్విడియాలో హైపర్ స్కేల్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ విభాగాల వైస్ ప్రెసిడెంట్ ఇయాన్ బక్, బ్రిటన్‌కు చెందిన చిప్ డిజైన్ సంస్థ ఆర్మ్ (Arm) సీఈఓ రెనే హాస్, ఇంటెల్ మాజీ సీఈఓ పాట్ గెల్సింగర్, ఎన్విడియాకు పోటీ ఇస్తున్న ఏఎండీ సీఈఓ లిసా సు, మార్వెల్ టెక్నాలజీ సీఈఓ మాట్ మర్పీ, యాపిల్ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ జానీ స్రౌజీ, యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ ఈ రేసులో ఉన్నారు.