NTV Telugu Site icon

Nurse Football: నర్సు నిర్వాకం.. బ్లడ్ శాంపిల్ తీసుకునే టైంలో..

Nurse Football Match

Nurse Football Match

Nurse Watches Football While Taking Blood From Seizure Patient: ఈమధ్య పేషెంట్ల పట్ల వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వాళ్లు చేసే తప్పిదాల కారణంగా.. పేషెంట్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి బ్రిటన్‌లో చోటు చేసుకుంది. ఒక నర్సు నిర్వాకం కారణంగా.. పేషెంట్‌కి పెద్ద గాయం అయ్యింది. బ్లడ్ శాంపిల్ తీసుకునే సమయంలో బ్లడ్ తీసుకోకుండా.. మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. పేషెంట్‌కి పెద్ద గాయమైనా పట్టించుకోకుండా.. చివర్లో అతడు నవ్వుతూ వెళ్లిపోవడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే..

Jennifer Garner: తండ్రి సినిమాలకు ఓటు… తల్లిప్రేమవైపే రూటు…!!

లిబ్బి బేట్స్‌ అనే 19 ఏళ్ల యువతి మూర్చరోగంతో బాధ పడుతోంది. ఇటీవల ఆమె మూర్ఛ రోగడంతో స్పృహ తప్పి పడిపోగా.. అంబులెన్స్‌లో వూల్‌విచ్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి ఆ యువతిని తీసుకువచ్చారు. రక్త పరీక్షల కోసం లిబ్సిని ఒక నర్సు ఓ గదిలోకి తీసుకువెళ్లాడు. బ్లడ్ శాంపిల్ తీసుకునే ముందు.. లిబ్సి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదని ఆమె తల్లి నికోలా బేట్స్ ఆ నర్సుని హెచ్చరించింది. అయితే.. అతడు అది వినిపించుకోలేదు. పైగా.. కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి, ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ, రక్తం సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో ఎలా పడితే అలా సూదితో గుచ్చడంతో.. లిబ్సి చేతికి పెద్ద గాయమైంది. అయినా పేషెంట్‌ బాధను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించాడు. చివరికి ఏదోలా రక్తం సేకరించి, బయటకు వెళ్లిపోయాడు.

Scott Styris: అతడు ఆల్‌రౌండర్ కాదు, అరకొర ఆటగాడు

ఇందుకు సంబంధించిన దృశ్యాలను లిబ్సి తల్లి నికోలా తన మొబైల్‌లో బంధించింది. అంతేకాదు.. రక్తం సేకరించిన తర్వాత ఆ నర్సు బయటకు వెళ్తున్నప్పుడు, ‘మీరు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆస్వాదించడం మర్చిపోకండి’ అంటూ కోపంలో వెటకారంగా చురకలంటించింది. అప్పుడు కూడా ఆ నర్సు నవ్వుకుంటూ వెళ్లిపోయాడే తప్ప, తాను చేసిన తప్పుని మాత్రం గ్రహించలేదు. ఈ విషయాన్ని నికోలా సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వ్యవహారాన్ని తాను ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు వాళ్లు రిప్లై ఇవ్వలేదని వాపోయింది. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పిందని పేర్కొంది.