Site icon NTV Telugu

వెన‌క్కి త‌గ్గ‌ని కిమ్… ఆంక్ష‌లు బేఖాతరు..!

ఉత్త‌ర కొరియా చీఫ్ కిమ్ ఏ చేసినా సంచ‌ల‌నంగా మారుతుంది.. వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో ఉండే కిమ్.. ఎన్నో ఆంక్ష‌లు పెట్టినా వెన‌క్కిమాత్రం త‌గ్గిన సంద‌ర్భాలు ఉండ‌వు.. ఇప్ప‌టికే అణ్వాయుధ క్షిప‌ణి ప్ర‌యోగాల‌తో అగ్ర‌రాజ్యం అమెరాకుకు సైతం స‌వాల్ విసిరిన కిమ్.. ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ఓ స్టెప్ వెన‌క్కి వేసిన‌ట్టే క‌నిపించారు.. కానీ, మ‌ళ్లీ ఆ దేశం అణ్వాయుధ క్షిపణి పరీక్షా కార్యక్రమాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి నిపుణులు ఒక త‌న‌ నివేదికలో పేర్కొంది.. అణ్వాయుధాలకు అవసరమైన సామగ్రిని మ‌ళ్లీ ఉత్తరకొరియా సంపాదించుకుంద‌ని ఆ నివేదిక‌లో తెలిపింది.. మ‌ళ్లీ క్షిపణి పరీక్షలను వేగవంతం చేసిందని, జనవరి నెల‌లో పలు పరీక్షలు నిర్వ‌హించింద‌ని పేర్కొంది. ఇక‌, అణ్వస్త్రాలకు అవసరమైన సాంకేతికతను సైబర్‌ మార్గంలో సంపాదిస్తోందని పేర్కొన్న నిపుణుల క‌మిటీ.. అందుకు కావాల్సిన ఆర్థిక సంపత్తిని సైబర్‌అటాక్స్‌తో కూడ‌బెడుతోంద‌ని తెలిపింది.

Read Also: ఒకే వీడియోతో సంచ‌ల‌నం… ఆ ‘గద్వాల రెడ్డి బిడ్డ’ ఇక లేడు..

Exit mobile version