Site icon NTV Telugu

North Korea: మరోసారి ఖండాంత‌ర క్షిప‌ణిని పరీక్షించిన ఉత్తర కొరియా

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా మరోసారి ఖండాంత‌ర క్షిప‌ణిని పరీక్షించింది. సాలిడ్‌ ఫ్యుయల్‌ టెక్నాలజీతో రూపొందిచిన ఖండాంతర క్షిపణిని మరోసారి పరీక్షించి ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. సాలిడ్ ఫ్యుయ‌ల్ టెక్నాల‌జీతో రూపొందించిన ఖండాంత‌ర క్షిప‌ణిని ఉత్తర కొరియా మరోసారి ప‌రీక్షించింది. ఒక కొత్త రకమైన ఘన-ఇంధన బాలిస్టిక్‌ క్షిపణి హసంగ్‌-18 ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ కేఎన్‌సీఏ (KCNA) వెల్లడించింది. 1,001 కిలోమీటర్ల ఎత్తులో సుమారు 70 నిమిషాల్లో 6,648 కిలోమీటర్ల దూరం ప్రయాణించి జపాన్‌ సముద్రంలో కూలిపోయిందని పేర్కొంది.

Read also: Pawan Kalyan: జనసేన టీడీపీకి బీ టీమ్‌ అనడంపై స్పందించిన పవన్‌

అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశాల ప్రకారం ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపింది. ప్యాంగాంగ్‌ తన గగనతల నిబంధలను అతిక్రమించిందిన ఆరోపించిన అమెరికా.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రయోగం జరిపినట్లు పేర్కొంది. సాలిడ్‌ ఫ్యూయల్‌ ఖండాంతర క్షిపణిని ఈ ఏడాది ఏప్రిల్‌ 14 కూడా ప్రయోగించిన విషయం తెలిసిందే. సాలిడ్‌ ఫ్యుయల్‌ క్షిపణి అంటే సాలిడ్ ఫ్యూయ‌ల్‌.. ఇంధ‌నం, ఆక్సిడైజ‌ర్ స‌మ్మేళ‌నం. ఘ‌న ఇంధ‌నంతో క్షిప‌ణిని ప్రయోగిస్తారు. లోహాల ధాతువుల‌తో ఘ‌న ఇంధ‌నాన్ని త‌యారు చేస్తారు. దీంట్లో అల్యూమినియం ఇంధ‌నంగా వ్యవ‌హ‌రిస్తుంది. అమోనియం ప‌ర్చులోరేట్‌ని కూడా వాడుతారు. ప‌ర్చులోరిక్ ఉప్పు, అమోనియా క‌లిసి.. సాధార‌ణ ఆక్సిడైజ‌ర్‌గా మారుతాయి. ఇంధ‌నాన్ని, ఆక్సిడైజ‌ర్‌ను ఓ హార్డ్ ర‌బ్బర్ వ‌స్తువులో మెట‌ల్ ప్యాక్ చేస్తారు. ఘ‌న ఇంధ‌నం అంటుకున్నప్పుడు.. అమోనియా ప‌ర్చులోరేట్‌లో ఉన్న ఆక్సిజ‌న్‌తో క‌లుస్తుంది. ఆ ద‌శ‌లో అత్యంత భారీ స్థాయిలో ఎన‌ర్జీ రిలీజు అవుతుంది. దాదాపు 2760 డిగ్రీల సెల్సియ‌స్ శ‌క్తి విడుద‌ల అవుతుంది. ఆ ఎన‌ర్జీతోనే లాంచ్ ప్యాడ్ నుంచి మిసైల్ ఎగురుతుంది.

Read also: Samantha:‘సమంత’కి కొత్త తలనొప్పి.. ఆ పాత ట్వీట్ తవ్వి మరీ ఆడేసుకుంటున్న ఫాన్స్

శ‌తాబ్ధాల క్రిత‌మే చైనాలో ఘ‌న ఇంధ‌నానికి చెందిన బాణాసంచాను డెవ‌ల‌ప్ చేశారు. అయితే 20వ శ‌తాబ్ధంలో దానికి చెందిన ప్రోగ్రెస్ చోటుచేసుకుంది. 1970 ద‌శకంలోనే ర‌ష్యా త‌న తొలి సాలిడ్ ఫ్యూయ‌ల్ ఐసీబీఎంను ప‌రీక్షించింది. ఆ త‌ర్వాత ఫ్రాన్స్ మీడియం రేంజ్‌ ఎస్‌3 మిస్సైల్‌ను టెస్ట్ చేసింది. 1990 ద‌శ‌కం నుంచి ఐసీబీఎంల‌ను చైనా టెస్టింగ్ చేయ‌డం ప్రారంభించింది. లిక్విడ్ ఉత్ప్రేర‌కాలు ఎక్కువ శ‌క్తిని రిలీజ్ చేస్తాయి. కానీ వాటి కోసం సంక్లిష్టమైన టెక్నాల‌జీ అవ‌స‌రం ఉంటుంది. ఆ క్షిప‌ణుల‌ బ‌రువు కూడా మ‌రీ అధికంగా ఉంటుంది. ఇక ఘ‌న ఇంధ‌నం .. ఎక్కవ సాంద్రత‌తో ఉంటుంది. చాలా తొంద‌ర‌గా అది అంటుకుంటుంది. సాలిడ్ ఫ్యూయ‌ల్ ఎక్కువ కాలం డీగ్రేడ్ కాకుండా ఉంటుంది. కొత్త సాలిడ్ ఐసీబీఎంను డెవ‌ల‌ప్ చేయ‌డం వ‌ల్ల నార్త్ కొరియా త‌న న్యూక్లియ‌ర్ కౌంట‌ర్ అటాక్ సామ‌ర్థ్యాన్ని పెంచుకుంటుంది. హసంగ్‌-18 క్షిప‌ణితో అది అటాక్ చేసేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version