NTV Telugu Site icon

North Korea: క్షిపణి స్థావరాలను సందర్శించిన అధ్యక్షుడు కిమ్

Northkoreakim

Northkoreakim

దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా అప్రమత్తమైంది. తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి స్థావరాన్ని సందర్శించారు. బాలిస్టిక్ ఆయుధాలను తనిఖీ చేశారు. దక్షిణ కొరియాతో ప్రమాదం పొంచి ఉంటే ముందు జాగ్రత్తగా వ్యూహాత్మక నిరోధక చర్యలపై దళాలను సంసిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇంకో వైపు హమాస్-హిజ్బులా-ఇజ్రాయెల్ మధ్య ప్రచండ యుద్ధం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో రెండు దేశాల మధ్య అలాంటి వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా-ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో సరిహద్దును పూర్తిగా మూసేసేందుకు ఉత్తరకొరియా సన్నాహాలు చేస్తోంది. రోడ్డు, రైలు మార్గాలను నిలిపివేసి బలమైన రక్షణ నిర్మాణాలతో తమ ప్రాంతాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది.

తాజాగా క్షిపణి స్థావరాలను కిమ్ పరిశీలించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తప్పవా? అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. క్షిపణులు సామర్థ్యాలను కిమ్ పరిశీలించినట్లు ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మీడియా విడుదల చేసిన చిత్రాల్లో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ ఆయుధాల రవాణా, ప్రయోగ వాహనాలను పరిశీలించారు.