Site icon NTV Telugu

North Korea: జుట్టుకు కలర్‌ వేస్తే అరెస్ట్‌..! కిమ్‌ అంతే..

Kim Jong Un

Kim Jong Un

ఉత్తర కొరియా చీఫ్ కిమ్‌ తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అయిన సందర్భాలు ఎన్నో.. అయినా.. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానిని కఠినంగా అమలు చేస్తారు.. ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటారు.. తాజాగా, విదేశీ సంస్కృతి అరికట్టాలన్న ఉద్దేశంతో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఉత్తరకొరియా సర్కార్.. ముఖ్యంగా మహిళలపై ఈ ఆంక్షలు విధించింది.. 30 ఏళ్లలోపు మహిళల్ని టార్గెట్‌ చేసిన కిమ్‌… మహిళలు టైట్​ జీన్స్ ధరించడం, జుట్టుకు రంగులు వేయడం, అసభ్యకర రాతలు రాసిఉన్నట్టువంటి బట్టలు ధరించడాన్ని సీరియస్‌గా తీసుకుంది..

Read Also: AP Government: పరిశ్రమలకు గుడ్‌న్యూస్‌.. పవర్ హాలిడే ఎత్తివేత..

రోజురోజుకీ పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు కఠిన ఆంక్షలు తీసుకొచ్చింది ఉత్తర కొరియా. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య గల యువతులు, మహిళలను టార్గెట్‌ చేసింది.. టైట్​జీన్స్, జుట్టుకు రంగులు, అసభ్యకర రాతలు గల బట్టలు ధరించడం చేయొద్దని స్పష్టం చేసింది.. తమ నిర్ణయానికి భిన్నంగా వేషధారణతో ఉంటే.. వెంటనే పెట్రోలింగ్​అధికారులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తారు.. నేరాన్ని ఒప్పుకుని.. తిరిగి అలాంటి తప్పుచేయనని హామీ ఇచ్చిన తర్వాతే విడుదల చేసే విధంగా నిర్ణయం తీసుకుంది కిమ్‌ సర్కార్. కాగా, మే నెలలోనే జీన్స్, హెయిర్​ స్టైల్స్​ను నిషేధించింది ఉత్తర కొరియా… ఈ విదేశీ స్టైల్స్‌ ప్రమాదకరమైన విషంగా పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్​ఉన్‌.. ఆ తర్వాత వీటిపై ఫోకస్‌పెట్టిన అధికారులు ఆంక్షల కఠినంగా అమలు చేస్తున్నారు.

Exit mobile version