Site icon NTV Telugu

Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత

Nobuyooyama

Nobuyooyama

చిన్న పిల్లల కార్టూన్ ఛానల్‌లో డోరేమాన్ ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈ ప్రోగ్రామ్ చిన్న పిల్లలదే అయినా.. వారితో పాటు పెద్దవాళ్లు కూడా చూసి ఆనందిస్తుంటారు. ముఖ్యంగా ఇందులో నోబితా-డోరేమాన్ కాంబినేషన్ విచిత్రంగా ఉంటుంది. నోబితా స్నేహితులతో ఇబ్బందులు పడినప్పుడల్లా డోరేమాన్ గ్యాడ్జెట్స్ కోసం బతిమాలుతో ఉంటాడు. ఏదొకటి ఇచ్చేదాకా వదిలిపెట్టడు. ఇలా డోరేమాన్ కార్యక్రమం చిన్నారులను ఆకట్టుకునేలా సాగిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.

ఇది కూడా చదవండి: Mahadev Betting App: జ్యూస్ అమ్ముకునే స్థాయి నుంచి రూ.6000 కోట్ల నేరసామ్రాజ్యం..

పిల్లి రూపాన్ని పోలియున్న డోరేమాన్ వాయిస్ అందించే ఆర్టిస్ట్ నోబుయో ఒయామా తుదిశ్వాస విడిచింది. సెప్టెంబర్ 29న మృతి చెందినప్పటికీ ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. డోరేమాన్ వాయిస్‌ను ఒయామానే అందిస్తుంది. ఈ వాయిస్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. నోబుయో ఒయామా జపాన్‌కు చెందిన మహిళ. వృద్ధాప్య సంబంధ కారణాల వల్ల ఆమె కన్నుమూశారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. గత నెల 29న అనారోగ్య సమస్యలతో నోబుయో ఒయామా మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం (11-10-2024) ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డోరేమాన్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోరేమాన్‌ అంటే ఒయామానే గుర్తుకు వస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 2005 వరకు నోబుయో డోరేమాన్‌ పాత్రకు డబ్బింగ్‌ అందించారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version