Site icon NTV Telugu

No Rain Village: ఈ గ్రామమే ఓ అద్భుతం.. వర్షం పడదు.. మేఘాలను చేతితో తాకొచ్చు..

Yemen Village

Yemen Village

ప్రపంచంలో అసలు వర్షం పడని నేల, గ్రామం, పట్టణమంటూ ఉంటుందా? ఒక్కో చోటో ఒక్కో వాతావరణం ఉన్నా.. సీజన్లో మాత్రం వర్షం అనేది సర్వసాధారణ విషయమే. కానీ వర్షం పడని గ్రామం, ఊరు అంటూ ఉండదు. అలాంటి గ్రామం కానీ, పట్టణం కానీ ఉందా? అంటే లేదనే చెబుతారంతా. అయితే ఈ గ్రామం గురించి వింటే మాత్రం ఉందని ఒప్పుకొక తప్పదు. అవును.. ఇది ఆశ్చర్యపరిచే విషయమే అయినా.. భూమి మీద అలాంటి ఓ వింత ఉందని మీకు తెలుసా. ఇక దాని ప్రత్యేకత తెలిస్తే అద్భుతమంటూ ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఈ గ్రామం ఏంటీ.. ఇదేక్కడుందో తెలియాలంటే ఇక్కడో లుక్కేయండి

ఈ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఓల్డ్ సౌత్ అరెబియన్ యెమెన్‌ రాజధాని సనాకు పశ్చిమ దిశలో ఉంటుంది. ఇది భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మేఘాలు ఉండే ప్రాంతానికంటే కూడా ఎత్తులో ఉంటుంది. అంటే.. ఈ గ్రామంలో మేఘాలు మనుషుల కాళ్ల కింద ఉంటాయి. వీటిని ఈజీగా చేతులతో తాకొచ్చు. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉండటం వల్లే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. వర్షాలు పడకపోవడం ఒక్కటే కాదు అల్‌ హుతైబ్‌ గ్రామంలో వాతావరణం పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించేంత వరకు ఈ గ్రామాన్ని చలి కప్పేస్తుంది. సూర్యుడు ఉదయించగానే ఎండలు మండిపోతాయి. మళ్లీ సూర్యుడు అస్తమించగానే ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతాయి. అయితే ఈ గ్రామ ప్రజలల్లో చాలా మంది మన ముంబై నుంచి వలస వెళ్లిన వాళ్లు ఉండటం విశేషం.

అల్‌ హుతైబ్‌ గ్రామంలో అల్‌ బోహ్రా (అల్‌ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్‌ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. ఇక్కడ వీళ్లు మన ముంబై నుంచి వలస వెళ్లినవాళ్లే. ముంబైకి చెందిన మహమ్మద్‌ బుర్హానుద్దీన్‌ నేతృత్వంలోని ఇస్మాయిలీ విభాగం నుంచి వచ్చి అల్‌ హుతైబ్‌లో స్థిరపడ్డారు. ఇది ప్రపంచంలోని పర్యటక ప్రదేశాల్లో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్. టూరిస్టులకు ఇది ఫేవరేట్ స్పాట్. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మేఘాలపై నిలబడి వర్షం భూమి మీద పడే సుందర దృశ్యాన్ని చూసేందుకు అల్‌ హుతైబ్‌ గ్రామానికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. కొండపై నుంచి కిందకు వెళ్తూ వర్షా్న్ని తాకుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు.

Exit mobile version