Site icon NTV Telugu

Nimisha Priya: యెమెన్ చేరుకున్న నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు.. విడిచిపెట్టాలని కుమార్తె వేడుకోలు

Nimishapriya

Nimishapriya

కేరళ నర్సు నిమిషా ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్ దేశానికి చేరుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ఆధ్వర్యంలో యెమెన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నిమిషా ప్రియ కుమార్తె మిషెల్(13) ప్రభుత్వాన్ని దయ కోరింది. తన తల్లిని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను.’’ అంటూ మిషెల్ తన తల్లి గురించి చెప్పడం వీడియోలో కనిపించింది. దయతో తన తల్లిని కరుణించి విడిచి పెట్టాలని యెమెన్ అధికారులను మిషెల్ వేడుకుంది.

కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ.. 2017, జూలైలో యెమెన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో అరెస్టు అయింది. మరొక నర్సు సహాయంతో మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి అతని శరీరాన్ని ముక్కలు చేసి, అవశేషాలను భూగర్భ ట్యాంక్‌లో పడవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నిమిషా ఈ ఆరోపణలను కోర్టులో సవాలు చేసింది. కానీ కోర్టులు ఆమె అప్పీళ్లను తోసిపుచ్చాయి. చివరికి ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చింది. అనంతరం న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే భారతప్రభుత్వం జరిపిన దౌత్యం ఫలించింది. చివరి నిమిషంలో నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పింది. ప్రస్తుతం ఆమెను క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేఏ.పాల్ ప్రయత్నిస్తున్నారు. అక్కడి ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?

నిమిషా ప్రియ.. 2008 నుంచి యెమెన్‌లో నర్సుగా పనిచేస్తోంది. 2011లో వివాహం తర్వాత ఆమె తన భర్త టామీ థామస్‌తో కలిసి యెమెన్‌ దేశానికి వెళ్లింది. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఆమె భర్త కుమార్తెతో కేరళకు తిరిగి వచ్చేశాడు. నిమిషా మాత్రం యెమెన్‌లోనే ఉండిపోయింది. అనంతరం ఆమె యెమెన్ జాతీయుడి మెహదీతో కలిసి నర్సింగ్ హోమ్ ప్రారంభించింది. అయితే ఆమెపై మెహదీ అఘాయిత్యం చేయబోయాడు. అనేక మార్లు శారీరికంగా వేధించాడు. అంతేకాకుండా పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నాడు. అయితే పాస్‌పోర్టును తిరిగి పొందే క్రమంలో మత్తు మందులు ఇచ్చానని.. కానీ అతడు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే చనిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైలులో ఉంది.

ఇది కూడా చదవండి: Pahalgam Terrorists: పహల్గామ్ ఉగ్రవాదులు హతం.. వెలుగులోకి ఫొటోలు

 

Exit mobile version