NTV Telugu Site icon

Charles Sobhraj: ఆయనకు 64, ఆమెకు 21.. సీరియల్ కిల్లర్‌తో మూడుముళ్ళు..

Nikita Biswas

Nikita Biswas

Nihita Biswas, the loving wife of Bikini Killer Charles Sobhraj: చార్లెస్ శోభరాజ్ ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలియని పేరు అయితే 1970లో వరస హత్యలతో సంచలనం సృష్టించాడు. ‘‘బికిని కిల్లర్’’గా పేరొందాడు. అయితే మొత్తం 20కి పైగా హత్యలు చేసినట్లు శోభరాజ్ పై అభియోగాలు ఉన్నాయి. ఇద్దరు అమెరికన్లను హత్య చేసిన నేరం కింద ప్రస్తుతం నేపాల్ లో శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్ సుప్రీంకోర్టు శోభరాజ్ ను విడుదల చేయాలని తీర్పు చెప్పింది

అయితే ఇంతటి సీరియల్ కిల్లర్ కు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా తనకన్నా 40 ఏళ్లు చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నికితా బిస్వాస్, శోభరాజ్ భార్య ప్రస్తుతం తన భర్త విడుదల కోసం ఎదురుచూస్తోంది. నేపాల్ కోర్టు శోభరాజ్ ని విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆమె ఆనందంతో ఉంది.

Read Also: Pawan Kalyan: పవన్ కాన్వాయ్ లో మరో 6 వాహనాలు.. అవేంటంటే..?

శోభరాజ్ 64 ఏళ్లు, నికితా బిశ్వాస్ కు 21 ఏళ్లు ఉన్న సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఈ నేపాలీ యువతి ఇప్పటికీ శోభరాజ్ కు ఏం తెలియదని.. అతడు నిర్దోషి అని నమ్ముతోంది. తొలిసారిగా అతన్ని జైలులోనే నికితా కలుసుకుంది. నేపాల్ జైలులో ఉన్న సమయంలో తనకు భాషను అర్థం చేసుకునేందుకు ట్రాన్స్ లేటర్ కావాలని కోరిన సమయంలో జైలులో పరిచయం అయింది నిఖితా బిశ్వాస్. ఆ సమయంలోనే శోభరాజ్ తో ప్రేమలో పడింది. జైలులో ఉండగానే అతడిని పెళ్లి చేసుకుంది. 2003లో నేపాల్ ప్రభుత్వం ఖాట్మాండులో శోభరాజ్ను అరెస్ట్ చేసింది. 2008లో నికితా బిశ్వాస్ ను పెళ్లి చేసుకున్నాడు శోభరాజ్.

వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జన్మించిన శోభరాజ్ వియత్నాం తల్లి, భారతీయ మూలాలు ఉన్న తండ్రికి జన్మించాడు. ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఫ్రాన్స్ లో కూడా ఇతనిపై నేరాలు ఉన్నాయి. 1970లో థాయ్ లాండ్ లోని పట్టాయా బీచ్ లో ఓ అమెరికన్ యువతి శవం బీచ్ లో కనిపించడంతో ఒక్కసారిగా శోభరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇండియాలో కూడా హత్యలకు పాల్పడి 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. మొత్తం 20 మంది వరకు హత్యలకు పాల్పడ్డాడు. ముందుగా వారితో స్నేహం చేసుకుని, మత్తు మందు ఇచ్చి హత్యలకు పాల్పడే వాడు. తాజాగా నేపాల్ సుప్రీంకోర్టు తీర్పులో మరోసారి చార్లెస్ శోభరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది.

Show comments