Site icon NTV Telugu

లాక్‌డౌన్ ముచ్చ‌టే లేదు.. తేల్చేసిన ప్ర‌ధాని.. కానీ,..!

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంప‌చ దేశాల‌ను చుట్టేస్తూనే ఉంది.. కొన్ని దేశాల‌పై విరుచుకుప‌డుతోంది.. మ‌రికొన్ని దేశాల్లో క‌ల్లోలం సృష్టిస్తోంది.. దాని దెబ్బ‌కు థ‌ర్డ్ వేవ్.. కొన్ని ప్రాంతాల్తో ఫోర్త్ వేవ్ కూడా వ‌చ్చేసింది.. దీంతో ఆంక్ష‌ల బాట ప‌డుతున్నాయి అన్ని దేశాలు.. మ‌రోవైపు.. కరోనా ఫ‌స్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన న్యూజిలాండ్.. ఒమైక్రాన్ మాత్రం ఇంకా ఎంట‌ర్ కానీలేదు.. అయితే, ఒక వేళ ఒమిక్రాన్ వ‌చ్చినా లాక్‌డౌన్‌కు వెళ్లేది లేదంటున్నారు ఆ దేశ ప్ర‌ధాని.. ఒమిక్రాన్ వ్యాప్తి అనివార్యమైతే మీరు ఎలాంటి చర్యలకు పూనుకుంటారంటూ ఎదురైన ప్ర‌శ్న‌కు స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్.. లాక్‌డౌన్ జోలికి మాత్రం వెళ్లేదిలేదంటూ స్ప‌ష్టం చేశారు.. కానీ, ఒమిక్రాన్ ఎంట్రీ ఇస్తే మాత్రం.. క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

Read Also: టీమిండియాకు మ‌రో షాక్‌.. ఒక్క‌రికి కూడా ద‌క్క‌ని చోటు

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాపై చేసిన పోరాటంతో పోలీస్తే.. ఒమిక్రాన్‌పై చేయాల్సిన పోరాటం భిన్న‌మైన‌దిగా పేర్కొన్న ప్ర‌ధాని జెసిండా.. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబ‌ట్టి.. గ‌తంలో కంటే మరింత ప్లాన్‌గా ప‌నిచేయాల్సి ఉంటుంద‌న్నారు.. కానీ, ఒకసారి ఒమిక్రాన్ ఎంట‌ర్ అయితే.. దానిని నియంత్రించడం స‌వాలే అన్నారు. అయితే, ఒమిక్రాన్ వెలుగు చూసిన 24 గంట‌ల‌ నుంచి 48 గంటల్లోనే దేశం ‘రెడ్’ సెట్టింగ్స్‌లోకి వెళ్లిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు.. అంటే.. వ్యాపార కార్యకలాపాలు, దేశీయ ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, విద్యార్థులు మాస్కులు ధరించాలని, వందమందికి మించి జనానికి అనుమతి ఉండదని క్లారిటీ ఇచ్చారు ప్రధాని జెసిండా అర్డెర్న్.. కాగా, క‌రోనాపై పోరాటంలో మొద‌ట‌ల్లో క‌ఠిన లాక్‌డౌన్‌లు విధిస్తూ.. న్యూజిలాండ్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ధాని జెసిండాపై ప్ర‌శంస‌లు కూడా కురిపించారు.

Exit mobile version