Site icon NTV Telugu

2025 New Year: కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన న్యూజిలాండ్.. గ్రాండ్‌గా సెలబ్రేషన్స్

New Zealand

New Zealand

ప్రపంచంలో న్యూజిలాండ్ వాసులు 2025 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. గ్రాండ్‌గా కొత్త సంవత్సరం ఆరంభమైంది. పసిఫిక్ మహా సముద్రం కిరిబాటి దీవుల్లో మొట్ట మొదటిగా కొత్త సంవత్సరం ప్రారంభమైంది. న్యూజిలాండ్‌లోని చాతమ్ ఐలాండ్స్‌లో కొత్త ఏడాది ఆరంభమైంది. దీంతో ఆక్లాండ్‌లో సంబరాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మొత్తం దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి కేరింతలు చేస్తున్నారు.

ఇక ఇండియాతో పాటు ఆయా దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశ ప్రజలు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే గ్రాండ్‌గా ఈవెంట్‌లు ఏర్పాటు చేశారు. పల్లె, పట్టణాల్లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

 

Exit mobile version