లైంగిక వేధింపుల ఆరోపణలు.. గవర్నర్‌కు బిగుస్తోన్న ఉచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కరోనా సమయంలో ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన ఆయనను.. ఇప్పుడు ఆయన్ను పదవి నుంచి తప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆండ్రూ క్యూమో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఉద్యోగిని రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆండ్రూ క్యూమో తనను లైంగికంగా వేధించారంటూ ఆయన దగ్గర పని చేసిన ఓ మహిళా ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరో 10 మంది మహిళలు కూడా ఆండ్రూ క్యూమో చేసిన నీచాల గురించి బయటపెట్టారు. దీంతో ఈ ఆరోపణలపై విచారణ జరిగింది.
ఆండ్రూ క్యూమో 11 మంది మహిళలను లైంగికంగా వేధించారని న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ తాజాగా ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంతేకాకుండా ఆండ్రూ క్యూమో కార్యాలయంలో సీనియర్ కార్యదర్శిగా పని చేస్తున్న మెలిస్సా డెరోసా పేరును 168 పేజీల నివేదికలో 187సార్లు ప్రస్తావించింది. ఓ బాధితురాలి విషయంలో ఆండ్రూ క్యూమో చేసిన అకృత్యాలను కవర్ చేయడానికి మెలిసా డెరోసా ప్రయత్నించారని పేర్కొంది. దీంతో మెలిస్సా డెరోసా.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. బాధిత మహిళల్లో ఒకరు కొద్ది రోజుల కింద న్యూయార్క్ గవర్నర్‌పై క్రిమినల్ కేసు పెట్టారు. చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అభిశంసన ద్వారా గవర్నర్ పదవి నుంచి ఆండ్రూ క్యూమోను తప్పించే అంశంపై చర్చించేందుకు న్యూయార్క్ అసెంబ్లీ జ్యూడిషియరీ కమిటీ సమావేశం కానుంది. రాజీనామా చేయాలంటూ ఆండ్రూ క్యూమోపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా మరికొందరు డెమొక్రాట్లు కూడా క్యూమో పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు.
Also Read
- China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
- Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
- TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
తాజావార్తలు
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్‌లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
-
Takshaka : వశిష్ట తమ్ముడి డైరెక్షన్లో ‘తక్షక’
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!