Site icon NTV Telugu

Consular Center:ఇండో–అమెరికన్లకు శుభవార్త.. ప్రారంభమైన ఇండియన్ కాన్సులర్ సెంటర్

Untitled Design (4)

Untitled Design (4)

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కాన్సులర్ సెంటర్ డిసెంబర్ 15, 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ సేవలు, వీసా సంబంధిత ప్రక్రియలు, ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దరఖాస్తులు, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందే అవకాశం కలుగుతుంది.

ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని 800 S ఫిగ్యురోవా స్ట్రీట్, సూట్ 1210, లాస్ ఏంజిల్స్, CA 90017 చిరునామాలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు పనిచేస్తుంది. దరఖాస్తుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శనివారాల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ దరఖాస్తులు మరియు రిన్యూవల్, వీసా సేవలు, OCI కార్డు కొత్త దరఖాస్తులు, రీ-ఇష్యూ మరియు ఇతర మిస్సెలేనియస్ సేవలు, భారత పౌరసత్వం త్యజింపు (సరెండర్ సర్టిఫికేట్), గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ (GEP), అటెస్టేషన్‌తో పాటు ఇతర కాన్సులర్ సేవలు అందించబడతాయి. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఇకపై దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేకుండా, సమయం మరియు ఖర్చును ఆదా చేసుకుంటూ సౌకర్యవంతంగా సేవలు పొందగలుగుతారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు ఇది ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చనుంది.

Exit mobile version