Site icon NTV Telugu

ఫేస్‌బుక్ అధినేత పెంపుడు జంతువుల‌పై నెటిజ‌న్లు కామెంట్లు…

ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూక‌ర్ బ‌ర్గ్ రెండు మేక‌ల‌ను పెంచుకుంటున్నారు.  వీటిని ఇటీవ‌లో త‌న సోష‌ల్ మీడియా ఫేస్‌బుక్ ద్వారా ఆయ‌న ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు.  ఈ రెండిండికి రెండు ర‌కాల విచిత్ర‌మైన పేర్లు పెట్టారు.  అందులో ఒక‌టి బిట్ కాయిన్ కాగా, రెండో దానిపేరు మాక్స్.  అయితే, నెటిజ‌న్లు మాత్రం వీటిపై కామెంట్లు చేస్తున్నారు.  స్పేస్ ఎక్స్ అధినేత ఎల‌న్ మ‌స్క్ పేరును గుర్తు చేసేలా ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.  ఎల‌న్ మ‌స్క్ బిట్ కాయిన్‌కు పోటీగా డాగీ కాయిన్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.  మ‌రి నెటిజ‌న్ల్ కామెంట్ల‌పై జూక‌ర్ బ‌ర్గ్ ఎలా స్పందిస్తారో చూడాలి.  

Exit mobile version