Site icon NTV Telugu

Nepal: సాధారణ స్థితికి నేపాల్.. ముగ్గురు మంత్రులతో కేబినెట్ విస్తరణ

Nepal

Nepal

నేపాల్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. అల్లర్లు, హింస తర్వాత పరిస్థితులు నెమ్మది.. నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి. సోమవారం ప్రజలు యథావిధిగా తమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. నేపాల్ మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితులు కుదిటపడుతున్నాయి. రాజధాని ఖాట్మండు నగరంలోని వీధులు, మార్కెట్లు యథావిధిగా రద్దీగా కనిపించాయి.

ఇది కూడా చదవండి: Earthquake: ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వణికిన పిల్లల వార్డు.. అస్సాం నర్సులు ఏం చేశారంటే..!

ఇదిలా ఉంటే సోమవారం ఉదయం తాత్కాలిక ప్రధాని సుశీల కర్కీ కేబినెట్ విస్తరణ చేశారు. ముగ్గురు మంత్రులతో విస్తరించారు. ఖాట్మాండులోని రాష్ట్రపతి భవన్‌లో సీతల్ నివాస్‌లో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కుల్మాన్ ఘిసింగ్, ఓం ప్రకాష్ ఆర్యల్, రామేశ్వర్ ఖనాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంధనం, పట్టణాభివృద్ధి, భౌతిక మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖను పర్యవేక్షించడానికి కుల్మాన్ ఘిసింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇక ఓం ప్రకాష్ ఆర్యల్‌కు చట్టం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అప్పగించగా.. రామేశ్వర్ ఖనాల్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ అప్పగించారు.

ఇది కూడా చదవండి: Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్

గత సోమవారం ఉన్నట్టుండి జెన్-జెడ్ ఉద్యమం ఉధృతం అయింది. కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్డెక్కారు. వేలాది మంది ఖాట్మండుకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ ఎత్తేయాలని కోరారు. అది కాస్త హింసాత్మకంగా మారి ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల నివాసాలు ధ్వంసం చేసేంత వరకు వెళ్లింది. ఈ అల్లర్లలో 19 మంది నిరసనకారులు చనిపోగా.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం అయింది. దీంతో కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది.

Exit mobile version