Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Nawaz Sharif Watches Dhurandhar 2 Secretly

Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

Published Date :April 6, 2026 , 8:26 am
By Suresh Maddala
  • ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని
  • రహస్యంగా సినిమా వీక్షించి పాత్రపై ప్రశంస
Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్-2’ సినిమా భారీ విజయంతో దూసుకెళ్తోంది. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శనను పాకిస్థాన్‌లో అధికారికంగా నిషేధం విధించారు. కానీ పైరసీ రూపంలో అనధికారికంగా దాయాది దేశంలో చలామణి అవుతోంది.

అయితే ధురందర్-2 సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాను రహస్యంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వీక్షించినట్లుగా పాకిస్థాన్ జర్నలిస్ట్ ఖలీద్ మెహమూద్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నవాజ్ కుమార్తె మరియం నవాజ్‌ను కూడా జర్నలిస్ట్ ట్యాగ్ చేశాడు. ఇక ఈ సినిమాను విడుదలైన రోజునే మార్చి 19న తాను లాహోర్‌లో వీక్షించినట్లుగా జర్నలిస్ట్‌ తెలిపాడు.

అయితే ధురందర్-2 సినిమాను నవాజ్ షరీఫ్ రహస్యంగా చూశారని.. తనను పోలి ఉన్న పాత్రను చూసి ఎంతగానో మురిసిపోయారని.. తన పాత్రను ప్రశంసించారని జర్నలిస్ట్ తెలిపాడు. సినిమా కాపీని ఏర్పాటు చేయాలని తన స్నేహితుడిని షరీఫ్ కోరారని.. సినిమా కాపీని తెప్పించుకుని పూర్తిగా సినిమా వీక్షించారని పేర్కొన్నాడు.

Pd

ధురంధర్-2లో సినిమాలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇక నవాజ్ షరీఫ్ పాత్రలో ప్రముఖ చిత్ర నిర్మాత కమల్ అమ్రోహి మనవడు మషూర్ అమ్రోహి నటించారు. నవాజ్ షరీఫ్‌కు తగ్గట్టుగానే ఆ పాత్రలో ఒదిగిపోయాడు. పాత్రను సహజంగా చూపించేందుకు అమ్రోహీ ప్రత్యేకమైన ప్రోస్తెటిక్ మేకప్‌తో పాటు ప్రత్యేక బాడీ సూట్ ఉపయోగించినట్లు సమాచారం. ఆసక్తికర విషయం ఏంటంటే మొదట మషూర్ అమ్రోహి… మెజర్ ఇక్బాల్ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వగా.. ఆ పాత్ర చివరికి నటుడు అర్జున్ రాంపాల్‌కు దక్కింది.

Ew

ధురంధర్ -2 పాకిస్థాన్ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా పైరసీ ద్వారా ప్రదర్శింపబడుతోంది. స్థానిక మార్కెట్లలో సినిమా కాపీలు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఇక నవాజ్ షరీఫ్.. ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నయ్య.

 

Nawaz Sharif greatly appreciated his role in Dhurandhar 2. He asked a friend to arrange a copy of the film and watched it in full.#Dhurandhar2‌TheRevenge@MaryamNSharif@AdityaRajKaul pic.twitter.com/9CROAMF6Lx

— Khalid Mehmood Khalid (@kmkhalid62) April 5, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar film news
  • banned films Pakistan
  • Bollywood Pakistan controversy
  • Dhurandhar 2 cast
  • Dhurandhar 2 Pakistan ban

తాజావార్తలు

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

  • RCB 5 Records: డివిలియర్స్ రికార్డును సమం చేసిన టిమ్ డేవిడ్.. 250 పరుగులతో 5 రికార్డులు నెలకొల్పిన ఆర్‌సిబి

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions