National Lazy day: ఇవాళ లేజీడే సందర్భంగా కొన్ని విషయాలు మీకోసం. ఇంట్లో, ఆఫీసుల్లో తదితర ప్రదేశాల్లో ఎదుటి వారు చెప్పిన పనిని చేస్తాం అంటూ దాటిస్తుంటే వారిని ఇతనికి బద్దకం వదిలేయ్యండి అంటుంటారు. ఇతను సోమరిపోతులా తయారయ్యాడు అంటూ తిడుతూ ఉంటారు. కానీ.. ఈ బద్ధకం Lazy ness ను ఆహ్లాదించడానికి ఓ రోజుందని కొందరికే తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 10వ తేదీని నేషనల్ లేజీ డేను అట్టహాసంగా చేసుకుంటారట. అలాగే బద్ధకం మంచిదేనంటూ.. బిల్ గేట్స్ లాంటి వాళ్లే.. తాను బద్ధకస్తులనే పనిలో పెట్టుకుంటా అని చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్నారు. కొందరు శాస్త్రవేత్తలు కూడా బద్ధకం మంచిదే అని.. అయితే అతి బద్ధకం మాత్రం యమ డేంజరస్ అంటున్నారు. అయితే.. ఈ లేజీనెస్ కు ఒకరోజు కేటాయించడం చిత్రమే. అయినా, ఓ రోజంతా బాగా రెస్ట్ తీసుకుని తమకిష్టమైన పనులను చేసుకునేందుకు నేషనల్ లేజీ డేను పాటిస్తున్నారు.
read also: Munugode ByPoll : దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలతో గులాబీ పార్టీ గుణపాఠం నేర్చుకుందా?
జీవితంలో ఉరుకులు పరుగులు సహజం. ఉదయం నుంచి మొదలు ఏదో ఒక పని చేస్తూ మిషన్లలా మనుషులు మారిపోతున్న రోజులివి. రోజంతా మిషన్లలా పనిచేస్తూ శరీరంలో శక్తి అంతా ఆవిరైపోయేలా, ఆందోళనతో జీవించే జీవితంతో నిద్ర పోని రోజులివి. దీంతో అనారోగ్యాల బారిన పడి సంపాదించినదంతా ఆసుపత్రుల బిల్లులు కట్టాల్సిన పరిస్థితులు. ఈక్రమంలో పని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ రీఫ్రెష్ అయిపోతామని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొద్ది మంది మాత్రం ఎప్పుడూ మంచం మీదనో, సోఫాలోనో పడుకుంటూ లేజీగా గడిపేస్తారు. అయితే.. ఇలాంటి వారిని మినహయిస్తే బద్ధకం ప్రతి మనిషికి ఎంతో కొంత మంచిదేనంటున్నారు వైద్య నిపుణులు. కానీ, లేజీగా గడపడం కూడా ఒక రకంగా చికిత్స వంటిదే. శరీరాన్ని, మనసును పూర్తిస్థాయిలో పునరుత్తేజితం చేయడానికి దోహడపడుతుంది. దీన్ని ఇదేక్రమంలో బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు. బద్ధకం అనేది రీఫ్రెష్ మెంట్ కోసమే తప్ప పని చేయకుండా తప్పించుకోవడానికి కాదు.
read laso: Bharatiya Janata Party : ఆ అలనాటి తారలు మళ్ళీ రాజకీయాల్లో తళుక్కుమంటారా?
ఈరోజు లేజీ డే కావున ఏం చేయాలో కూడా పలువురు పరిశోధకులు సూచిస్తున్నారు. మనిషి ఒత్తిడిని దూరం చేయడం కోసం ఈరోజు కావల్సినంత సమయం నిద్రపోవాలని దీనిద్వారా మైండ్ రీఫ్రెష్ అయ్యి కొన్ని రోజుల వరకు పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్, నోటిఫికేషన్లు, మెసెజ్ లు చూస్తూ ఇబ్బంది పడకుండా ఇంటర్నెట్ ను ఆఫ్ చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. మనిషి డబ్బు విసయంలో సమస్యలు ఎక్కువే అయినా నిద్ర పోయేముందు దాని గురించి ఆలోచించకుండా, ఇష్టమైన పనులపై సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు. ఈవిధంగా ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఎక్కువ సంతోషం పొందొచ్చు. అంతేకాదు ఇష్టమైన ఆహారాన్ని తినండంతో.. ప్రశాంతంగా నిద్రపోతే మెమరీ పవర్ కూడా పెరుగుతుందంట. ఇంకెందుకు ఆలస్యం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా డే మొత్తం ఎంజాయ్ చేసేయండి.
Corbevax: కార్బెవాక్స్ బూస్టర్ డోస్ కు ఆమోదం.. కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్నా కూడా..