Site icon NTV Telugu

నాసా కీల‌క ప‌రిశోధ‌న‌: అంగార‌కుడిపై నీటి జాడ‌లు…

2030 త‌రువాత మ‌నిషి ఎలాగైనా మార్స్ మీద‌కు వెళ్లాల‌ని, అక్క‌డ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాల‌ని చూస్తున్నాడు. దానికోస‌మే కోస‌మే మార్స్‌పై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. మ‌నిషి ఆవాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా నీరు కావాలి నీరు ఉంటేనే అక్క‌డ మాన‌వ ఆవాసం సాధ్యం అవుతుంది. మార్స్‌పై నీటి జాడ‌లు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు నాసా ప్ర‌యోగాలు చేస్తున్న‌ది. ప్ర‌స్తుతం అంగార‌కుడిపై పరిశోధ‌న‌లు చేస్తున్న మార్స్ రిక‌న‌సెన్స్ ఆర్బిటార్ కీల‌క విష‌యాల‌ను తెలియ‌జేసింది.

Read: కోట్లాది మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌కు కాపాడుతున్న పీత‌లు… ఎలానో తెలుసా?

మార్స్‌పై నీటి జాడ‌లు ఉన్న‌ట్టు గుర్తించింది. అయితే, ఈ నీటి ప్ర‌వాహం ఇప్ప‌టిది కాద‌ని సుమారు రెండు వంద‌ల కోట్ల సంవ‌త్స‌రాల క్రితం నీరు ప్ర‌వ‌హించి ఉంటుంద‌ని తెలియ‌జేసింది. నీరు ఆవిరైపోగా మిగిలిన క్లోరైడ్ సాల్ట్‌పై ఎమ్ఆర్‌వో ప‌రిశోధ‌న‌లు చేసింది. దీనికి సంబంధించిన వివారాల‌ను నాసా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఉప్పునిల్వ‌లు ఉన్న ప్రాంతాల్లో నీటి కుంట‌లు ఉండేవ‌ని నాసా పేర్కొన్న‌ది. అయితే, ఇప్పుడు మార్స్‌పై నీరు లేక‌పోవ‌డానికి కార‌ణాలు ఏంటి అనే దానిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు శాస్త్ర‌వేత్త‌లు.

Exit mobile version