కొద్దిరోజుల క్రితం చందమామను ఓ భారీ రాకెట్ ఢీకొట్టిందనీ, దాని వల్ల రెండు పగులు లోయలు ఏర్పడ్డాయని ప్రకటించిన అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా తాజాగా మరో విచారకర విషయం చెప్పింది. ఓ శాటిలైట్ కక్ష్య నుంచి జారిపోయి చందమామవైపు వెళ్తోందని చెప్పింది. అంతేకాదు. చందమామను ఢీకొడుతుందా లేదా అన్నది నాసా స్పష్టం చెయ్యలేదు. అయితే.. ఆ శాటిలైట్ మైక్రోవేవ్ ఓవెన్ సైజులో ఉంటుందని పేర్కొంది. తాజాగా..ఈ సాటిలైట్ ప్రయోగించగా, భూమి చుట్టూ తిరగాల్సి ఉంది. అయితే.. జులై 4, 2022న అది దాని కక్ష్యా మార్గం నుంచి పక్కకు వెళ్లిపోయిందని.. దాంతో శాస్త్రవేత్తలకు దాన్ని కంట్రోల్ చేసే అవకాశం పోయిందని, ఆ శాటిలైట్ ఇప్పుడు చందమామవైపు వెళ్తోందని ప్రకటించారు.
read also: Crime: ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అలియాస్ దొంగ..
కాగా.. ఆ శాటిలైట్ పేరు క్యాప్‌స్టోన్.. దీన్ని రాకెట్ ల్యాబ్ కంపెనీ తయారుచేసింది. ఇది న్యూజిలాండ్‌కి చెందిన మహియా పెనిన్సులా వారం కిందట దీన్ని అంతరిక్షంలోకి పంపింది. అయితే.. ఈ శాటిలైట్ ప్రస్తుతం ఎనర్జీని తక్కువగా వాడుకుంటోంది. అయితే ఇది.. నెమ్మదిగా చందమామవైపు వెళ్తోందని, మరో 4 నెలల తర్వాత ఇది చందమామను చేరే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. చందమామకు సంబంధించి ఈ సంవత్సరం నాసాకు అత్యంత కీలకమైంది.. ఎందుకంటే ఆర్టెమిస్ అనే మిషన్‌ని నాసా, ఆగస్ట్ 2022లో ప్రారంభిస్తోంది. అయితే.. దీని ద్వారా, చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి మొదటిసారి మహిళా వ్యోమగామి నీ, మరో వ్యోమగామిని దింపాలని చూస్తోంది. అయితే.. 1972లో చివరిదైన అపోలో 17 మిషన్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ జర్నీ మొదలవుతోంది.
MISSION UPDATE: Teams are working to re-establish contact with our #CAPSTONE spacecraft which experienced communications issues while in contact with the Deep Space Network. Additional updates will be provided as soon as possible: https://t.co/gRhJKAAZPn pic.twitter.com/IHuurVI5Bm
— NASA Ames (@NASAAmes) July 5, 2022
