Chernobyl: చెర్నోబిల్ అణు విపత్తును యావత్ ప్రపంచం మరిచిపోదు. సోవియట్ యూనియన్‌లోని అణు కర్మాగారం కుప్పకూలడంతో 1986లో చెర్నోబిల్ అణు విపత్తు ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఫోటోలు షాకింగ్‌కి గురిచేస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న కుక్కలు నీలిరంగులోకి మారుతున్నాయి. ఈ చిత్రాలను డాగ్స్ ఆఫ్ చెర్నబిల్ అనే సంస్థ షేర్ చేసింది. ఈ కుక్కలు అణు విపత్తు తర్వాత ఈ ప్రాంతంలో మిగిలిపోయి ఉన్నాయి. చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్‌లో ఇవి మనుగడకు చిహ్నాంగా మారాయి.
అణు విపత్తు జరిగిన తర్వాత ఈ ప్రాంతం నుంచి మనుషులు దాదాపుగా బయటకు వచ్చారు. అయితే, వీరంతా బయటకు వచ్చిన తర్వాత ఇక్కవ వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. అణు విపత్తు జరిగిన ప్రాంతం చుట్టూ, రేడియేషన్ కారణంగా 18 చదరపు మైళ్ల ఎక్స్‌క్లూజన్ జోన్ ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న కుక్కల్లో మూడు కుక్కలు నీలిరంగు బొచ్చులో కనిపించాయి. ఇలా ఆకస్మికంగా అసాధారణంగా రంగు మార్పు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణాలు తెలుసుకోవడానికి పరిశోధకులు వాటి బొచ్చు, చర్మం, రక్త నమూనాలను సేకరిస్తున్నారు.
