Site icon NTV Telugu

Myanmar: భూమిపై నుంచి గాల్లోని విమానంపైకి కాల్పులు.. ప్రయాణికుడికి తీవ్రగాయాలు

Myanmar Incident

Myanmar Incident

Bullet pierces through Myanmar plane mid-air in Myanmar:మయన్మార్ దేశంలో ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోంచి దించి అక్కడ సైన్యం అధికారాన్ని చేపట్టింది. ఆంగ్ సాంగ్ సూచీని అరెస్ట్ చేసి జుంటా ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటి నుంచి ఆ దేశంలో ప్రజాస్వామ్యం కోరుకుంటున్న వారికి, సైన్యానికి మధ్యలో తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. పలు రెబెల్ గ్రూపులు, సైన్యానికి వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నాయి. దీంతో అక్కడ కాల్పులు నిత్యకృత్యంగా మారాయి.

ఇదిలా ఉంటే ఆదివారం మయన్మార్ లో ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంపై భూమి నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. మయన్మార్ నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన డొమెస్టిక్ ఫ్లైట్‌లో తూర్పు కయాహ్ రాష్ట్ర రాజధాని లోయికావ్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం గాల్లో 3000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో భూమి పై నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్ విమానాన్ని చీల్చుకుంటూ.. లోపల ఉన్న ప్రయాణికుడికి గాయాలు చేసింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత గాయపడిన ప్రయాణికుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Read Also: Tamil Nadu: తాగుడుకి బానిసై… కన్నకూతురి జీవితం చిదిమేసే యత్నం

ఈ ఘటన తర్వాత అధికారులు లోయికావ్ వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. మయన్మార్ ప్రభుత్వ ప్రతినిధి మేజర్ జనరల్ జామిన్ తున్ ఇది నేరపూరిత కుట్ర అని శనివారం అభివర్ణించాడు. కయాహ్ రాష్ట్రంలోని తిరుగుబాటు దళాలు కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీ, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ విమానంపై కాల్పులు జరిపాయని అక్కడి సైనిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆరోపణల్ని తప్పుపట్టాయి తిరుగుబాటు దళాలు.

గాయపడిన 27 ఏళ్ల వ్యక్తి నైపిటాల్ నుంచి లోయికావ్ వస్తున్నారని అధికారులు వెల్లడించారు. తిరుగుబాటు దళాలపై చర్యలు తీసుకుంటామని మయన్మార్ సైన్యం ప్రకటించింది. కాల్పుల కారణంగా బుల్లెట్ విమానంలోని ప్యూజు లేన్ ను దెబ్బతీసింది. లోపల కూర్చున్న ప్రయాణికుడి ముఖానికి, మెడ, చెంపకు గాయాలు చేసింది. గాయాల పాలైన వ్యక్తి నుంచి రక్తం వస్తున్న ఫోటోలను విమానం క్రూ షేర్ చేసింది.

Exit mobile version