ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా, అది చేయాల్సి విద్వంసం చేసేసింది. కరోనా మహమ్మారి ధాటికి యూరప్ దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ఠానంలో ఉండే యూరప్ దేశాలు ఈసారి వాటి స్థానలను కోల్పోయాయి. ఇక, కరోన కట్టడి విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసి కరోనాకు చెక్ పెట్టిన న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని నగరాలు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో చోటు సంపాదించాయి. ఇకపోతే, నివాసయోగ్యం కాని నగరాల లిస్ట్ లో సిరియాలోని డమాస్కస్ మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి ఆరోగ్యవ్యవస్థల పనితీరును కూడా పరిగణలోకి తీసుకొన్నారు. ఈసారి నివాసయోగ్యమైన నగరాల జాబితాలో మొదటిస్ధానంలో న్యూజిల్యాండ్ రాజధాని అక్లాండ్ నిలిచింది.
ప్రపంచంలో నివాసయోగ్యం కానీ నగరం ఏదో తెలుసా?
