NTV Telugu Site icon

కిలో మ‌ట్టి రూ.900 కోట్లు…

మార్స్ గ్ర‌హంపై దిగిన మార్స్ రోవ‌ర్  వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పైన‌, మార్స్ మ‌ట్టిపైన ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది.  అయితే, మార్స్ గ్ర‌హంపై నుంచి మ‌ట్టిని త‌వ్వి భూమి మీద‌కు తీసుకొచ్చేందుకు నాసా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ప్ర‌స్తుతం నాసా పంపిన రోవ‌ర్ మ‌ట్టిని సేక‌రించే ప‌నిలో ఉన్న‌ది. ఈ ప్ర‌క్రియ‌ను 2023 సంవ‌త్స‌రం నాటికి పూర్తి అవుతుంది. ఆ త‌రువాత నాసా అరుణ గ్ర‌హం మీద‌కు స్ఫెష‌ల్ వ్యోమ‌నౌక‌ల‌ను పంపి మ‌ట్టిని నేల‌మీద‌కు తీసుకురానున్న‌ది.  అయితే ఇదంతా వెంట‌నే పూర్త‌య్యే ప్ర‌క్రియ కాదు.  ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి క‌నీసం ప‌దేళ్లు ప‌డుతుంద‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  దీనికోసం నాసా రూ.900 కోట్ల ర‌పాయ‌ల‌కు పైగా వెచ్చించ‌బోతున్న‌ది.  మార్స్ మీదున్న మ‌ట్టిని భూమి మీద‌కు తీసుకురాగ‌లిగితే, ప్ర‌పంచంలో అత్యంత విలువైన వ‌స్తువుగా మార్స్ క్లే నిలుస్తుంది.