NTV Telugu Site icon

Nigeria: నైజీరియాలో విషాదం.. పడవ బోల్తా పడి 100 మంది మృతి

Nigeria

Nigeria

ఉత్తర నైజీరియాలోని నైజర్ నదిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 100 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. కోగి రాష్ట్రం నుంచి పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరో 100 మంది గల్లంతైనట్లు నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం తెలిపారు. సామర్థ్యానికి మంచి ప్రయాణం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. లైఫ్ జాకెట్లు, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు జాగ్రత్త.. హిందువులపై దాడుల మధ్య బంగ్లాదేశ్‌కి హెచ్చరిక..

శుక్రవారం తెల్లవారుజామున కోగి రాష్ట్రం నుంచి నైజర్‌లో ఫుడ్‌ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ పడవ ప్రమాదానికి గురైంది. గల్లంతైన వారిలో ఏడుగురు మృతి చెందారని.. మిగతా వారిని రక్షించేందుకు స్థానిక డైవర్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. బోటు మునగడానికి గల కారణాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఓవర్‌లోడ్‌ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్‌కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!

Show comments