కరోనా వైరస్ పీడ పోకముందే మరోవైరస్ కలకలం రేపుతోంది. పలుదేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ వ్యాప్తిపై తాజాగా నిపుణులు పలు పరిశోధనలు చేపట్టారు. అది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, కానీ సోకిన వ్యక్తితో నిరంతరం సన్నిహితంగా ఉంటే వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వెల్లడించింది.
వైరస్ సోకిన వారితో శారీరక సంబంధం ద్వారా.. వారి దుస్తులు, వారు దుప్పట్లు తాకడం ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తోందని సీడీసీ చీఫ్ రోచెల్ వాలెన్స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. దద్దుర్లు కలిగించే ఈ వైరస్ కొవిడ్ లాగా గాలిలో ఉండదని.. ఈ వ్యాధి సాధారణ సంభాషణల ద్వారా, కిరాణా దుకాణంలో ఇతరులను దాటవేయడం, డోర్ నాబ్‌ల వంటి వాటిని తాకడం ద్వారా వ్యాపించదని వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన కేసులన్నీ ప్రత్యక్షంగా తాకడం వల్లే వచ్చాయని చెప్పుకొచ్చారు.
Corona Effect : కరోనా బాధితుల్లో పని సామర్థ్యం తగ్గుతోంది.. తాజా నివేదిక
ఏదైనా లైంగిక సంక్రమణ ఉన్న అమెరికన్లను మంకీపాక్స్ వైరస్ గురించి పరీక్షించాలని పలువురు నిపుణులు ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా సూచించారు. చాలా మంది రోగులు జననేంద్రియాలు, మలద్వారంపై దద్దుర్లు, పుండ్లతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల నుంచి వెలువడిన తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని వాలెన్స్కీ నొక్కిచెప్పారు.