Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
- లండన్‌లో ఇరాన్ సుప్రీంలీడర్‌కు లగ్జరీ అపార్ట్మెంట్లు..
- ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్నాయంటూ వార్తలు..
- వార్తల్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్, మొజ్తబాకు ఎలాంటి ప్రావర్టీలు లేవని క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయిల్ ఎంబసీకి సమీపంలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయంటూ బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మొజ్తబా ఖమేనీకి ఇరాన్లో కానీ, ఇతర విదేశాల్లో కానీ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయన తన తండ్రిలాగే నిరాడంబరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఈ ఆరోపనణల ద్వారా ఆయన వ్యక్తిగత జీవితం, ప్రతిష్టంపై తప్పుడు కథనాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.
బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెన్ గ్రీన్ ప్రాంతంలో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఉన్న వీధిలోనే రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఉన్నట్లు నివేదించాయి. 2014, 2016లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు, వాటిలో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీకి సంబంధాలు ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ రెండు ప్రాపర్టీల విషయంలో ఇరాన్‌కు చెందిన బ్యాంకర్ అలీ అన్సారీ పేరు వెలుగులోకి వచ్చింది. బ్రిటన్, అమెరికా ఆంక్షలు ఉన్న అన్సారీ ఈ ప్రాపర్టీలకు ఆర్థిక మధ్యవర్తిగా వ్యవహరించారని అమెరికా ఆరోపణలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఇదిలా ఉంటే, అన్సారీ-ఖమేనీ మధ్య ఆస్తుల సంబంధాన్ని ఇరాన్ ఖండించింది. ఈ రెండు అపార్ట్మెంట్లు ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఉండటంతో ఈ వార్తకు ప్రాధాన్యత ఏర్పడింది. లండన్‌లో ఇరాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులను యూదు కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, ప్రదేశాలపై నిఘా పెట్టిన ఆరోపణలపై అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఖమేనీ వార్త రావడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!