Site icon NTV Telugu

దలైలామాను కలిసిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం ప్రముఖ టిబెటన్‌ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. మెక్లీడ్‌గంజ్‌లోని దలైలామా నివాసంలో సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దలైలామా ఎవరితోనే ప్రత్యక్షంగా ఎవరినీ కలువ లేదు.

ఈ నెల 15న నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. ప్రవాస టిబెటన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్‌, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ కలిశారు. మోహన్‌ భగవత్‌ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా, ధర్మశాలలో ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన దలైలామాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నపరిస్థితులపై కూడా దలైలామాతో చర్చించినట్టు మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు.

Read Also:

https://ntvtelugu.com/the-ts-government-has-decided-to-fill-the-job-vacancies/
Exit mobile version