
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మోడెర్నా కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం అమెరికాతో సహా కొన్ని దేశాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారిపై మోడెర్నా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో కొత్త స్ట్రెయిన్ ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని, జూన్ నెలలో దక్షిణాది దేశాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని, ఫలితంగా కరోనా వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని మోడెర్నా సీఈవో స్టెఫెన్ బాన్సాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మోడెర్నా బూస్టర్ డోస్ ను తయారు చేసే పనిలో ఉన్నట్టు తెలిపారు.