పాక్‌లో మరో హిందూ ఆలయంపై దాడులు జరిగాయి. పాక్‌లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భాంగ్ నగరంలోని సిద్ధి వినాయక దేవాలయంపై కొంతమంది అల్లరిమూక దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అలయం పూర్తిగా ధ్వంసం అయింది. పాక్‌లో హిందువులు, సిక్కులు మైనర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మైనర్లపై అక్కడ తరచుగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రసిద్ది చెందిన ఎన్నో దేవాలయాలను అక్కడి మెజారిటీలు ధ్వంసం చేశారు. సిద్ధివినాయక దేవాలయంపై బుధవారం రోజున కొంతమంది మూక హఠాత్తుగా దాడి చేసి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆలయంలోని విగ్రహాలు, నిర్మాణాలను విరగగొట్టారు. ఆలయానికి నిప్పు అంటించడంతో కొంతభాగం ఆగ్నికి ఆహుతైంది.
పాక్ లో మరో హిందూ దేవాలయంపై దాడి…
