Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
- భారత్‌కు నిరాశ
- మిస్ వరల్డ్ 2026లో టాప్ 40కే నికితా పొర్వాల్
- జోహెయిర్రీ మోలా విజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss World 2026 Winner Joheirry Mola: మిస్ వరల్డ్ 2026 కిరీటం డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్నారు. వియత్నాంలో శనివారం, సెప్టెంబర్ 5న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అందాల భామలను వెనక్కి నెట్టి ఆమె ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్నారు. జోహెయిర్రీ మోలా విజేతగా నిలవగా.. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేయ్నెస్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. మలేషియాకు చెందిన తానుసియా చెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
డొమినికన్ రిపబ్లిక్కు మిస్ వరల్డ్ 2026 కిరీటం
గ్రాండ్ ఫినాలేలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన జోహెయిర్రీ మోలా చివరికి మిస్ వరల్డ్ 2026గా ఎంపికయ్యారు. ఆమెకు గత ఏడాది 72వ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచతా చువాంగ్స్రీ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించారు. జోహెయిర్రీ మోలా విజయంపై మిస్ ఇండియా ఆర్గనైజేషన్ కూడా అభినందనలు తెలిపింది. సంస్థ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. “మిస్ వరల్డ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 73వ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిర్రీ మోలాకు హృదయపూర్వక అభినందనలు” అంటూ మిస్ ఇండియా ఆర్గనైజేషన్ పేర్కొంది.
Also Read
మిస్ వరల్డ్ 2026 టాప్-6 ఫైనలిస్టులు వీరే
మిస్ వరల్డ్ 2026 పోటీలో చివరి దశకు చేరుకున్న టాప్-6 ఫైనలిస్టుల్లో వివిధ ఖండాలకు ప్రాతినిధ్యం వహించిన అందాల భామలు ఉన్నారు.
ఎరిట్రియా – స్నిట్ హబ్టియాబ్: People’s Choice Award విజేత
స్పెయిన్ – ఎలిసబెత్ రేయ్నెస్: యూరప్‌కు ప్రాతినిధ్యం
మలేషియా – తానుసియా చెట్టి: Beauty With a Purpose విభాగానికి ప్రాతినిధ్యం
వియత్నాం – లే న్గుయెన్ బావో న్గోక్: ఆసియా & ఓషియానియాకు ప్రాతినిధ్యం
డొమినికన్ రిపబ్లిక్ – జోహెయిర్రీ మోలా: అమెరికాస్ & కరీబియన్‌కు ప్రాతినిధ్యం
దక్షిణాఫ్రికా – రొమాండా హోంబిర్: ఆఫ్రికాకు ప్రాతినిధ్యం
ఈ టాప్-6 నుంచి చివరకు డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిర్రీ మోలా విజేతగా నిలిచారు.
భారత్‌కు నిరాశ.. టాప్ 40కే నికితా పొర్వాల్
మిస్ వరల్డ్ 2026లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నికితా పొర్వాల్ టాప్-40లో తమ ప్రయాణాన్ని ముగించారు. గ్రాండ్ ఫినాలేలో ఆమె టాప్-20లో చోటు దక్కించుకోలేకపోయారు. నికితా పొర్వాల్ ప్రయాణంపై మిస్ ఇండియా ఆర్గనైజేషన్ స్పందిస్తూ.. 73వ మిస్ వరల్డ్ ఎడిషన్‌లో టాప్-40లో నిలిచినందుకు ఆమెను అభినందించింది. వరుసగా ఐదు మిస్ వరల్డ్ ఎడిషన్లలో భారత్ టాప్ ప్లేసింగ్ సాధించిన ఘనతను కొనసాగించిందని పేర్కొంది. “ప్రపంచంలోని అతిపెద్ద వేదికల్లో ఒకటైన మిస్ వరల్డ్ పోటీలో నికితా భారత్‌ను ఎంతో గౌరవం, ఆత్మవిశ్వాసం, హృదయపూర్వకంగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె అందించిన ప్రతి క్షణానికి, భారత్‌కు తీసుకొచ్చిన ప్రతి అభినందనకు ధన్యవాదాలు. భారత్ ఎప్పటికీ మీ గురించి గర్విస్తుంది” అని మిస్ ఇండియా ఆర్గనైజేషన్ పేర్కొంది.
ప్రత్యేక దుస్తుల్లో మెరిసిన నికితా పొర్వాల్
మిస్ వరల్డ్ 2026 గ్రాండ్ ఫినాలే కోసం నికితా పొర్వాల్ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించారు. ఈ కస్టమ్-మేడ్ అవుట్‌ఫిట్‌ను ప్రముఖ డిజైనర్ భావనా రావు రూపొందించారు. మిస్ వరల్డ్ కిరీటం భారత్‌కు దక్కకపోయినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై నికితా పొర్వాల్ తనదైన ముద్ర వేశారు. మొత్తంగా, మిస్ వరల్డ్ 2026 పోటీలో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన జోహెయిర్రీ మోలా విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు. స్పెయిన్, మలేషియా వరుసగా ఫస్ట్, సెకండ్ రన్నరప్ స్థానాలను దక్కించుకోగా.. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నికితా పొర్వాల్ టాప్-40తో తన ప్రయాణాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!