Miss Puerto Rico And Miss Argentina Reveal That They’re Married: వారిద్దరు రెండు వేరువేరు దేశాలకు అందెగత్తెలు. వీరిని ఆరాధించే కుర్రాళ్లు కోట్లలో ఉన్నారు. కానీ వారిద్దరికి మాత్రం ఒకరంటే ఒకరికి ప్రేమ. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ హాట్ బ్యూటీస్ పెళ్లి చేసుకోవడం చాలా మంది కుర్రాళ్లను షాక్ కు గురిచేసింది. మాజీ మిస్ అర్జెంటీనా, మాసీ మిస్ ప్యూర్టోరికో ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు.
థాయ్ లాండ్ లో 2020 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో మరియానా వరెలా, ఫాబియోలా వాంటీనాలు తొలిసారిగా కలుసుకున్నారు. మరియానా వరెలా అర్జెంటీనాకు, ఫాబియోలా వాలెంటీనా ఫ్యూర్టో రికాకు ప్రాతినిధ్యం వహించారు. చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్న వీరిద్దరు అక్టోబర్ 28న పెళ్లి చేసుకున్నారు.
Read Also: Bharath jod Yatra: పోతురాజు అవతారమెత్తిన రాహుల్ గాంధీ
తొలిసారి పరిచయంతోనే వీరిద్దరి మధ్య బంధం విడదీయరానిదిగా మారింది. చాలా రోజులు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. తాజాగా తామిద్దరం పెళ్లి చేసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. మా బంధాన్ని ప్రైవేటుగా ఉంచాలని అనుకున్నామని.. అయితే ఓ ప్రత్యేక రోజున మీకు విషయాన్ని వెల్లడిస్తున్నామంటూ.. హార్ట్, రింగ్ ఎమోజీలను పోస్ట్ చేసింది. వీరిద్దరి రొమాన్స్ వీడియోలను, బీచులో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేశారు. ఈ వీడియోలకు ఇన్ స్టాలో 30 లక్షల వ్యూస్ వచ్చాయి. 2,48,906 మంది లైక్ చేశారు.
https://twitter.com/fireplaceashez/status/1587700582034325505
I bet they will have beautiful children. https://t.co/TwAlswShHf
— Tim Burchett (@timburchett) November 2, 2022
