Site icon NTV Telugu

Zohran Mamdani: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరానాయర్ పేరు..

Zohran Mamdani

Zohran Mamdani

Zohran Mamdani: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాను షేక్ చేస్తున్నాయి. లైంగిక నేరస్తుడు, ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(DOJ) విడుదల చేసింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు కూడా పత్రాల్లో ఉంది. అమ్మాయిల అక్రమ రవాణాదారు ఘిస్లైన్ మాక్స్‌వెల్ ఇంట్లో 2009లో ఆమె రూపొందించిన చిత్రం ‘‘అమేలియా’’ కోసం జరిగిన ఆఫ్టర్ పార్టీకి హాజరయ్యారని ఫైల్స్ వెల్లడించాయి.

శుక్రవారం ఎప్‌స్టీన్‌కు చెందిన మూడు మిలియన్లకు పైగా పేజీల పత్రాలను, 2000 వీడియోలు, 1,80,000 చిత్రాలు ఇందులో ఉన్నాయి. ప్రముఖ పబ్లిసిస్ట్ పెగ్గీ సీగల్, ఎప్‌స్టీన్‌కు పంపిన ఈమెయిల్‌లో ఈ ఆఫ్టర్ పార్టీకి చెందిన వివరాలు ఉన్నాయి. మాక్స్‌వెల్ టౌన్ హౌజ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మీరానాయర్ తో పాటు అప్పటి మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారని ఈమెయిల్‌‌లో ఉంది. మీరానాయర్ సినిమా అతిథుల్ని అంతగా ఆకట్టుకోలేనది కూడా పెగ్గీ సీగల్ అందులో చెప్పాడు.

ఏమిటి ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్:

ఈ కేసులో జెఫ్రీ ఎప్‌స్టీన్ అతని భాగస్వామి ఘిస్లైన్ మాక్స్‌వెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2002-2005 మధ్య జరిగిన ఈ సెక్స్ కుంభకోణంలో అనేక మంది యువతులకు డబ్బును ఎరగా వేసి జెఫ్రీ లైంగిక దాడులు చేయడమే కాకుండా, అనేక మంది అమెరికా పెద్దమనుషులకు మైనర్ అమ్మాయిలను సఫ్లై చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితుల్లో ఒకరైన వర్జీనియా గియుఫ్రే 2015లో సివిల్ దావా వేయడంతో ఈ పత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైళ్లలో అమెరికా రాజకీయ నాయకుల నుంచి పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఎప్‌స్టీన్ తన సెక్స్ ట్రాఫికింగ్ వ్యాపారాన్ని నిర్వహించడంలో అతనికి అనేక మంది సహకరించినట్లు ఈ ఫైల్స్ పేర్కొంది. ఎలా ఎప్‌స్టిన్, మాక్స్ వెల్ యుక్తవయసులోని బాలికలకు ఎలా ఈ అక్రమ రవాణా వ్యాపారంలోకి ఆకర్షించారనే వివరాలను ఫైల్స్ వెల్లడించే అవకాశం ఉంది. జులై 2019లో ఎప్స్టీన్‌పై సెక్స్ ట్రాఫికింగ్ అభియోగాలు మోపారు, అయితే అతను విచారణకు రాకముందే మాన్‌హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో మాక్స్‌వెల్ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Exit mobile version