Site icon NTV Telugu

సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్‌ కు ఫ్యాషన్ అయిపోయింది !

నెల్లూరు : రిపబ్లిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో నిన్న పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్‌ ఇచ్చారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ను తిట్టడం పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని… ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో చర్చించారని తెలిపారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం ? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి ? అని పవన్‌ పై ఫైర్‌ అయ్యారు.

పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్.. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ఉద్దేశమన్నారు.. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురు మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది ఇది ఎంతవరకు సబబు.. ? తన ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదని నిప్పలు చెరిగారు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అని… చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన వైపీసీ ప్రభుత్వానికి లేదన్నారు.. ”ప్రభుత్వ తీరును మారుస్తాను.. నేను రోడ్డు ఎక్కితే మనిషిని కాదు.. బెండు తీస్తాం.. అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశాం” అని ఎద్దవా చేశారు.

Exit mobile version