NTV Telugu Site icon

మైక్రోసాఫ్ట్ విండోస్ 11…ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ని విడుద‌ల చేసింది.  2015 లో మైక్రోసాఫ్ట్ 10 ఒఎస్ ను విడుద‌ల చేసిన ఈ సంస్థ ఆరేళ్ల త‌రువాత విండోస్ 11ని విడుద‌ల చేసింది.  విండోస్ 11లో అనేక అధునాతన ఆప్ష‌న్ష్‌ను తీసుకొచ్చింది.  విండోస్ 10 వ‌ర‌కు మెనూ బార్‌లో ఐకాన్‌లు సిస్టంలో రెండు చివ‌ర్లో ఉండేవి.  కానీ, విండోస్ 11లో మాత్రం మెనూబార్ ఆప్ష‌న్‌ను మిడిల్‌కు తీసుకొచ్చింది.  

Read: రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా)

విండోస్ 10ని వినియోగిస్తున్న‌వారు విండోస్ 11ని అప్‌గ్రేడ్ చేసుకోవ‌చ్చ‌ని విండోస్ ప్ర‌క‌టించింది.  స్నాప్ లే అవుట్‌, స్నాప్ గ్రూప్ తో పాటు మ‌ల్టీటాస్కింగ్‌కు ఇందులో అవ‌కాశం ఉంటుంది.  అంతేకాదు,  ఈ విండోస్‌ని ఆండ్రాయిడ్ యాప్‌ల‌లో కూడా వినియోగించే విధంగా త‌యారు చేసింది.  ఆండ్రాయిడ్‌, గూగుల్, ఆపిల్ నుంచి వ‌స్తున్న పోటీని దృష్టిలో పెట్టుకొని విండోస్ 11ను త‌యారు చేసిన‌ట్టు మైక్రోసాఫ్ట్ తెలియ‌జేసింది.