మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ కన్నుమూశారు.. అతని వయస్సు 26 సంవత్సరాలు.. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల, ఆయన భార్య అను దంపతుల కుమారుడు జైన్ నాదెళ్ల మరణించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.. 26 ఏళ్ల జైన్ సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నారు.. జైన్ జన్మించినప్పటి నుంచే సెరిబ్రల్ పాల్సీని ఎదుర్కొంటున్నాడు.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. జైన్ మరణించినట్లు సత్య నాదెళ్ల తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఈమెయిల్ ద్వారా తెలిపారు.
Read Also: Gun Firing: భూ వివాదం.. సెటిల్‌మెంట్‌కు పిలిచి హత్య
ఇక, 2014లో సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పట్టి నుంచి నాదెళ్ల వైకల్యాన్ని ఎదుర్కొంటున్నవారికి మెరుగైన సేవలందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు.. తన కుమారుడు జైన్‌ను పెంచడం.. అతడికి మద్దతు ఇవ్వడంలో తాను నేర్చుకున్న పాఠాలను కూడా కొన్ని సందర్భాల్లో ఉదహరించారు సత్య. గత సంవత్సరం, జైన్ తన చికిత్సలో ఎక్కువ భాగం పొందిన చిల్డ్రన్స్ ఆస్పత్రితో కలిసి ఎండోడ్ చైర్‌ను తయారు చేయడానికి సత్య నాదెళ్ల పనిచేశారు.