NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్ గెలవద్దని భార్య మెలానియా కోరుకుంటోందా..? వైట్‌హౌజ్ మాజీ అధికారి సంచలనం..

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలవగా, డెమోక్రాట్ పక్షాన కమలా హారిస్ పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ట్రంప్‌పై వైట్‌హౌస్ మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆంథోనీ స్కారాముచి సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ తన భర్తకు కాకుండా కమలా హారిస్‌కి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నాడు. మీడియాస్ టచ్ పోడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

మెలానియా, డొనాల్డ్ ట్రంప్ కన్నా కమలా హారిస్ విజయం పట్ల మరింత ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో మెలానియా ట్రంప్ గైర్హాజరవుతున్న సమయంలో స్కాముముచీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె కొన్ని ట్రంప్ నిధుల సేకరణ కార్యక్రమాలు, ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని ర్యాలీల్లో మాత్రమే ఆమె కనిపించారు.

Read Also: Supreme Court: బుల్డోజర్ చర్యలపై మండిపడ్డ సుప్రీంకోర్టు

కమలా హారిస్ గెలవడం పట్ల మెలానియా ట్రంప్ చాలా ఆసక్తిగా ఉన్నారని స్కారాముచి చెప్పారు. మెలానియా ట్రంప్‌ని ద్వేషిస్తున్నట్లు చెప్పాడు. తన భార్య కూడా డొనాల్డ్ ట్రంప్‌ని ద్వేషిస్తుందని వెల్లడించారు. ‘‘మెలానియా వలే నా భార్య కూడా ట్రంప్‌ని ద్వేషిస్తుంది’’ అని అన్నాడు.

ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్ తనపై, తన భార్య మెలానియా ట్రంప్‌పై స్కరాముచి చేసిన వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అతను తనపై కోపం పెంచుకున్నందు వల్లే ఈ వ్యాఖ్యలు చేశాడని చెప్పారు. మెలానియా ట్రంప్ లో ప్రొఫైల్ కోరుకుంటున్నారు. ఇదే కాకుండా తన కొడుకు బారన్ ట్రంప్ కాలేజీ ఎడ్యుకేషన్‌లో ఆమె నిమగ్నమై ఉన్నారు. అందుకే ఆమె ఎక్కువగా న్యూయార్క్‌కే పరిమితం కావడం వల్ల ట్రంప్ ర్యాలీలకు హాజరుకాలేదని తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కన్నా ఆమె తన కుటుంబం, వ్యక్తిగత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమచారం.

ఆంథోనీ స్కారముచి ఎవరు..?

ట్రంప్ హాయాంలో 2017లో కేవలం పదకొండు రోజుల పాటు వైట్ హౌస్‌లోని అన్ని కమ్యూనికేషన్‌లకు ఆంథోనీ స్కారాముచి బాధ్యత వహించాడు. ఆ ఏడాది జూలై 21 నుంచి జూలై 31 వరకు అతను పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ అతడిని తొలగించాడు. స్కారాముచి నియామకం మరుసటి రోజే వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ రాజీనామాకు దారి తీసింది. స్కారాముచినీ నియమించడంపై స్పైసర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.