శాంతి చర్చల వేళ రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై డ్రోన్ దాడులతో ప్రపంచమంతా కలవరపాటుకు గురైంది. తాజాగా న్యూఇయర్ వేడుకల వేళ మరోసారి రష్యాలో డ్రోన్ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఖేర్సన్ రీజియన్‌లోని నల్ల సముద్రం తీరంలో కేఫ్ అండ్ హోటల్‌పై మూడు డ్రోన్లు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా ఈ దాడి జరిగినట్లుగా ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో వెల్లడించారు. సుమారు 50 మంది గాయపడ్డారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Switzerland: న్యూఇయర్ వేళ ఘోర విషాదం.. ఓ బార్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి
