Site icon NTV Telugu

కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

ఇంగ్లండ్‌లో సామూహిక కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లైమౌత్‌లో పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఐదేండ్ల చిన్నారి ఉన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా మరణించాడని కార్న్‌వాల్‌ పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 6.10 గంటల ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని ఘటనా స్థలంలో ఉన్న ఓ మహిళ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఇది ఎలాంటి ఉగ్రవాద చర్యా కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, యూకేలో గత 11 ఏండ్లలో సామూహిక కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.

Exit mobile version